Begin typing your search above and press return to search.
కోట్లకు టెమ్ట్ అవ్వని సాయి పల్లవి
By: Tupaki Desk | 23 Dec 2021 5:30 AM GMTహీరో లేదా హీరోయిన్ ఎవరైనా కూడా ఒక్క సూపర్ హిట్ పడింది అంటే వరుసగా సినిమాలకు కమిట్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా హీరోయిన్స్ ఒక్క ఏడాదిలో అయిదు ఆరు సినిమాలకు సైన్ చేసిన సందర్బాలు చాలానే ఉన్నాయి. చాలా మంది హీరోయిన్స్ వచ్చిన ప్రతి ఒక్క ఆఫర్ కు సైన్ చేసి భారీ గా సంపాదించారు. కోట్ల పారితోషికాలతో సినిమాల ఆఫర్లు వస్తుంటే ఎవరు మాత్రం కాదంటారు. కొందరు హీరోయిన్స్ వరుసగా సినిమాలకు కమిట్ అవుతారు కాని అదే సమయంలో మంచి కథ మరియు దర్శకుడు ఇతర విషయాలను ఎంపిక చేసుకుంటూ ఉంటారు. సాయి పల్లవి మాత్రం స్లో అండ్ స్టడీ అన్నట్లుగా సినిమాలను చేస్తూ వెళ్తోంది. ఆమె గేట్లు తెరవాలే కాని ఒకే సారి పది సినిమా లు ఆమె చేతిలో ఉంటాయి. కాని ఆమె మాత్రం ఆచితూచి అన్నట్లుగా సినిమాలను ఎంపిక చేసుకుంటుంది.
హీరోయిన్ గా ఆమె ప్రస్తుతం తమిళంలో ఒక సినిమాను చేస్తోంది. తెలుగు లో ఆమె ఇప్పటికే లవ్ స్టోరీ తో వచ్చేసింది. శ్యామ్ సింగ రాయ్ తో రాబోతుంది. తెలుగు నుండి ఆమెకు చాలా ఆఫర్లు ఉన్నా కూడా ఆమె మాత్రం ఇప్పటి వరకు ఓకే చెప్పలేదు. విరాటపర్వం సినిమా ఎప్పుడో పూర్తి చేసింది. ఆ సినిమా ఎప్పటికి విడుదల అవుతుంది అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఇదే సమయంలో ఈమెకు హిందీ నుండి కూడా ఆఫర్లు వస్తున్నాయని అంటున్నారు. కాని ఏ ఒక్క దానికి కూడా ఈమె ఓకే చెప్పడం లేదట. తాజాగా ఆ విషయాన్ని స్వయంగా తానే ఒప్పుకుంది. ప్రస్తుతం చేస్తున్న సనిమాలు పూర్తి అయిన తర్వాత మాత్రమే తదుపరి సినిమాను కమిట్ అవుతాను అన్నట్లుగా చెప్పింది. కోట్ల రూపాయల పారితోషికాలతో.. లక్షల రూపాయల అడ్వాన్స్ తో ఫిల్మ్ మేకర్స్ ఆమె ముందు ఉన్నా కూడా ఆమె మాత్రం టెమ్ట్ అవ్వకుండా హోల్డ్ లో పెట్టేస్తుందట.
హీరోయిన్స్ అది కూడా స్టార్ హీరోయిన్స్ కోట్ల పారితోషికాలు వస్తున్న నేపథ్యంలో ఈజీగా అయ్యే సినిమాలకు ఓకే చెప్తున్నారు తప్ప వెబ్ సిరీస్ ల పట్ల ఆసక్తి చూపడం లేదు. క్రేజీ స్టార్ హీరోయిన్స్ చాలా తక్కువగా వెబ్ సిరీస్ లు చేస్తున్నారు. కాని సాయి పల్లవి మాత్రం కంటిన్యూస్ గా వెబ్ కంటెంట్ లో నటిస్తూనే ఉంది. వెబ్ కంటెంట్ లో తన నటన విశ్వరూపం చూపిస్తున్న సాయి పల్లవి మరో సారి ఒక వెబ్ మూవీ లో నటిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. నెట్ ఫ్లిక్స్ వారు ఆ వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నారు. ఇదే సమయంలో నెట్ ఫ్లిక్స్ లో ఒక వెబ్ సిరీస్ ను కూడా చేసేందుకు గాను ఈమె ఓకే చెప్పింది. ఈ రెండు కాకుండా మరిన్ని వెబ్ కంటెంట్ ల్లో నటించేందుకు సిద్దంగా ఉన్నట్లుగా ఈ అమ్మడు చెప్పుకొచ్చింది. కోట్లకు కోట్లు పారితోషికాలు వస్తున్నా కూడా సినిమాల కంటే వెబ్ సిరీస్ లపైనే సాయి పల్లవి ఆసక్తి చూపించడం ఆశ్చర్యంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.