Begin typing your search above and press return to search.
దేనికైనా కండీషన్స్ అప్లయ్ అంటోంది!
By: Tupaki Desk | 20 July 2020 1:30 AM GMTకొన్నిటిని అంగీకరించాలంటే గట్స్ ఉండాలి. దానికి మించి నిజాయితీ ఉండాలి. ఉన్నది ఉన్నట్టు ఒప్పుకునే మనసు కూడా ఉండాలి. ఇవన్నీ తనకు ఉన్నాయని నిరూపించింది సాయి పల్లవి. ఈ అమ్మడు గొప్ప అందగత్తె కాదు.. కానీ ప్రతిభతో రాణించి మేటి స్టార్ల జాబితాలో చేరింది. ప్రేమమ్ మొదలు ఫిదా లాంటి చిత్రంలో గొప్ప నటప్రదర్శనతో తెలుగింటి అమ్మాయిగా స్థిరపడిపోయింది. సౌత్ అంతటా సాయి పల్లవి ప్రతిభ గురించి ముచ్చట సాగుతోంది.
తాజా ఇంటర్వ్యూలో సాయి పల్లవి మాట్లాడుతూ తనకు స్టార్ హీరోయిన్ కావాలనే ఆశ లేనే లేదని ఇప్పటివరకూ చేసిన సినిమాలతో పూర్తిగా సంతృప్తి చెందానని తెలిపింది. ఇక ప్రేక్షకులు ఎప్పుడూ తనని గ్లామరస్ పాత్రల్లో చూడాలని చిట్టి పొట్టి దుస్తుల్లో చూడాలని అనుకోరని అందుకే అలాంటి ప్రయత్నాలు చేయలేదని నిజాయితీగా అంగీకరించింది.
కథతో పాటు తన పాత్రకు ప్రాధాన్యతనిస్తానని తెలిపిన సాయి పల్లవి తనవద్దకు వచ్చే వాటిని నిశితంగా పరిశీలిస్తానని వెల్లడించింది. పాత్ర నచ్చితేనే చేస్తాను అని అంది. కేవలం ప్రేక్షకుల కోణం మాత్రమే చూసి ఎంపికలు సాగిస్తానని వెల్లడించింది. దేనికైనా కండీషన్స్ అప్లయ్ అని కూడా చెప్పింది. సాయి పల్లవి నటించిన తాజా చిత్రం లవ్ స్టోరి (కమ్ముల- చైతూ) త్వరలో రిలీజ్ కి రానుంది.