Begin typing your search above and press return to search.
రీషూట్లకు డిమాండ్ చేస్తున్న భానుమతి
By: Tupaki Desk | 19 Nov 2018 5:30 PM GMTఫిదాలో తెలంగాణ యాసతో భానుమతిగా గుర్తుండిపోయిన సాయి పల్లవి తెలుగులో చేస్తున్న స్ట్రెయిట్ మూవీ పడి పడి లేచే మనసు ఒకటే. షూటింగ్ దాదాపు పూర్తయ్యే స్టేజిలో ఉన్న ఈ మూవీకి చిన్న చిన్న రిపేర్లు జరుగుతున్నాయని సమాచారం. ఫైనల్ రష్ చూసాక కొన్ని కీలక మార్పులు అవసరం అని భావించిన దర్శకుడు హను రాఘవపూడి కొంత భాగం రీ షూట్ చేయాలనీ డిసైడ్ అయ్యాడట.దానికి నిర్మాతతో పాటు హీరో కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. స్క్రిప్ట్ తనకు వ్యక్తిగతంగా నచ్చినది కావడంతో సాయి పల్లవి కూడా ఓకే చెప్పింది.
కానీ కాల్ షీట్స్ ఎక్కువగా అవసరం కావడంతో ఆ మేరకు తనకు ఎక్స్ ట్రా పారితోషికం ఇవ్వాలని కండిషన్ పెట్టిందట. తొలుత అవాక్కైనా తర్వాత వేరే ఆప్షన్ లేదు కాబట్టి నిర్మాత ఓకే చెప్పినట్టు సమాచారం. ఇది అఫీషియల్ గా వచ్చిన న్యూస్ కానప్పటికీ ఫిలిం నగర్ లో చర్చ జోరుగా సాగుతోంది. డిసెంబర్ 21న డేట్ ఫిక్స్ చేసుకున్న పడి పడి లేచే మనసుకు చేతిలో నెల రోజుల సమయం మాత్రమే ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు ప్రమోషన్ ని ప్లాన్ చేయాల్సి ఉంది. అదే రోజు పోటీ తీవ్రంగా ఉన్న నేపధ్యంలో ఓపెనింగ్స్ బాగా రావాలి అంటే హైప్ ని పెంచాలి.
వరుణ్ తేజ్ అంతరిక్షంతో పాటు యాష్ కెజిఎఫ్ కూడా అదే డేట్ ఫిక్స్ చేసుకుంది. యాత్ర కూడా వస్తుంది అన్నారు కానీ తేదీ మారే ఛాన్స్ ఉంది. సో 30 రోజుల లోపే ఉన్న గడువును సద్వినియోగపరుచుకోవడం పడి పడి లేచే మనసు టీమ్ కి సవాల్ లాంటిదే. గతంలో నాని నాగ శౌర్యలతో నటిస్తున్నప్పుడు కొన్ని వివాదాల్లో తన పేరు వచ్చేలా చేసుకున్న సాయి పల్లవి ఇప్పుడీ పారితోషికం విషయంలో మరోసారి వార్తల్లోకి ఎక్కింది.