Begin typing your search above and press return to search.

నీ సంగతి చూస్కోపో అంది -సాయి పల్లవి

By:  Tupaki Desk   |   23 April 2018 11:33 AM IST
నీ సంగతి చూస్కోపో అంది -సాయి పల్లవి
X
కొన్ని సినిమాలు ఆయా నటీనటులపై తీవ్రమైన ప్రభావం చూపుతుంటాయి. ఆ క్యారెక్టర్లో ఇమిడిపోతే.. దాని నుంచి బయటకు వచ్చేందుకు చాలా కష్టపడాల్సి వస్తుంది. ఒకోసారి తోటి నటీనటులతో అనుబంధం కూడా చాలా బలమైన ముద్ర వేస్తుంది.. వారిని మరపు రాకుండా చేస్తుంది. టాలీవుడ్ లో ఇప్పుడు సెన్సేషనల్ హీరోయిన్ అయిపోయిన సాయిపల్లవి పరిస్థితి ఇప్పుడు ఇలాగే ఉంది.

ఫిదా.. ఎంసీఏ చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఈ భామ.. కణం అనే మూవీతో ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తమిళ్ లో దియా అన్న పేరుతో రూపొందిన ఈ చిత్రంలో హీరోగా నాగశౌర్య నటించాడు. కణం మూవీలో నటించిన అమ్మాయి వెరోనికాతో తనకు బోలెడంత అనుబంధం ఏర్పడిపోయిందని చెబుతోంది సాయిపల్లవి. షూటింగ్ జరుగుతున్నంత సేపు తాను ఆ పిల్లకు అమ్మగా నటిస్తున్న విషయాన్ని మరచిపోయానని.. నిజంగానే అమ్మగా ఫీలయిపోయినట్లు చెప్పుకొచ్చింది సాయిపల్లవి.

వెరోనికాతో ఎంతగా కనెక్ట్ అయిపోయిందంటే.. ఓ సమయంలో ఆ పిల్లను తాను దత్తత తీసుకోవాలని అనుకుందట. దర్శకుడితోనే కాదు.. ఆ పిల్ల తల్లిని కూడా ఇదే మాట అడగకుండా ఉండలేకపోయిందట. అయితే.. వెరోనికా తెల్లి మాత్రం.. తన కూతురు గురించి పట్టించుకోవడం కాకుండా.. నీ గురించి నువ్వు ఆలోచించుకోమని సలహా ఇచ్చిందట. అంతగా వెరోనికా తన మనసుకు దగ్గరైపోయిందిని చెప్పింది సాయి పల్లవి.