Begin typing your search above and press return to search.

సాయిపల్లవి పెళ్లికి నో.. ఎందుకంటే...

By:  Tupaki Desk   |   3 Nov 2016 4:05 AM GMT
సాయిపల్లవి పెళ్లికి నో.. ఎందుకంటే...
X
సాదారణంగా... పెళ్లి చేసుకోను - ఇలాగే కొనసాగుతాను - నా కెరీర్ సక్సెస్ రీచ్ లో పెళ్లి కచ్చితంగా ఆటంకం అని భావిస్తున్నాను అని చాలా మంది మగవాళ్లు అనడం పాత విషయం! ఇప్పుడు ఆ లిస్ట్ లో అమ్మాయిలూ బాగానే చేరిపోతున్నారు. తాజాగా ఆ లిస్ట్ లో చేరిపోతానంటుంది సాయి పల్లవి. మలయాళం చిత్రం ప్రేమమ్‌ తో ఒక్కసారిగా సూపర్ ఫేమస్ అయిన సాయిపల్లవి... తాజాగా పెళ్లిపై స్పందించి ఇలా షాక్ ఇచ్చింది. సోషల్ మీడియాలో అభిమానులతో ఇంట్రాక్ట్ అవ్వడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా సాయిపల్లవిపై ప్రశ్నల వర్షం కురిపించారు ఆమె అభిమానులు.

ఈ క్రమంలో తనకు నచ్చిన చిత్రం.. సూర్త్య నటించిన కాక్క కాక్క అని - నట్టిన పాట.. రెమో నీ కాదలన్ - ఇక మాంశాహారం ముట్టనని చెప్పుకొచ్చిన ఈ కేరళ కుట్టి... పెళ్లి విషయానికి వచ్చేసరికి షాకింగ్ న్యూస్ చెప్పింది. ఈ క్రమంలో మీరు పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటారా? ప్రేమ వివాహం చేసుకుంటారా? అని ఎదురైన ప్రశ్నకు... "నేను అసలు పెళ్లే చేసుకోను" అని స్పందించింది సాయిపల్లవి. దానికి వేరే కారణాలేమీ కాదు సుమా... జీవితాంతం ఆమె తల్లిదండ్రులతోనే ఉంటూ వారిని కంటికి రెప్పలా చూసుకోవాలని అనుకుంటుందట. అందుకే పెళ్లికి దూరంగా ఉండాలని భావిస్తుందట.

కాగా వైద్య విద్యనభ్యసించి ఈ బ్యూటీ... గతంలో కొన్ని చానళ్లలో డాన్స్ పోటీల్లోనూ పాల్గొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్‌ కు జంటగా "ఫిదా" అనే చిత్రంలో నటిస్తుంది. ఇంతకు ముందు కోలీవుడ్‌ లో మణిరత్నం దర్శకత్వంలో నటించే లక్కీచాన్స్ వచ్చినట్లే వచ్చి మిస్ అయింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/