Begin typing your search above and press return to search.

సాయి పల్లవి ఆసుపత్రి నిర్మాణం చేపడుతుందా?

By:  Tupaki Desk   |   19 Nov 2022 12:00 PM GMT
సాయి పల్లవి ఆసుపత్రి నిర్మాణం చేపడుతుందా?
X
సాయి ప‌ల్ల‌వి కొత్త సినిమా రిలీజ్ అయి నెల‌లు గ‌డుస్తోంది. ఈ ఏడాది రెండు సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చినా అంచ‌నాలు అందుకోలేదు. అలాగ‌ని అమ్మ‌డికి అవ‌కాశాలు రాలేద‌నుకుంటున్నారా? అలాగైతే పొర‌బ‌డిన‌ట్లే. ప‌ల్ల‌వి ప్ర‌తిభ అవ‌కాశాలు క్యూ క‌డుతున్నాయి. కోట్ల రూపాయ‌ల ఆఫ‌ర్లు ఇంటి ముందున్నాయి. కానీ అన్నింటిని నో అనేసిస్తుంది.

ఏ సినిమా చేసినా..ఎలాంటి పాత్ర‌లో క‌నిపించినా అది మ‌న‌సుకు న‌చ్చిన‌దై ఉండాలి? అలాంట‌ప్పుడు పారితోషికం..స్టార్ డ‌మ్ తో ప‌నిలేకుండా చేస్తాను అంటుంది. కాబ‌ట్టి ఆ ర‌కంగా సాయి ప‌ల్ల‌వికి అవ‌కాశాలు లేక ఖాళీగా ఉది అన్న మాట స‌రిప‌డ‌దు. కొద్ది రోజులుగా సాయి ప‌ల్ల‌వి జాడ టాలీవుడ్ లో ఎక్క‌డా క‌నిపించ‌లేదు. సోష‌ల్ మీడియా యాక్టివిటీ కూడా చాలా రేర్ కావ‌డంతో అమ్మ‌డి కి సంబంధ‌ఙంచి ఎలాంటి అప్ డేట్ కూడా క‌నిపించ‌లేదు.

మ‌రి సాయి ప‌ల్ల‌వి సీక్రెట్ గా ఏం చేస్తుంది? ఎక్క‌డ ఉంటుంది? సినిమాలు కాకుండా ఇంకా ముఖ్య‌మైన ప‌నులు ఏవైనా ఉన్నాయి? అంటే అవునే వినిపిస్తుంది. సాయి ప‌ల్ల‌వి న‌టి క‌న్నా ముందు డాక్ట‌ర్ అన్న సంగ‌తి తెలిసిందే. డాక్ట‌ర్ చ‌దువు మ‌ధ్య‌లో సినిమా అవకాశాలు రావ‌డంతో ఎంట్రీ ఇచ్చింది. ఈ క్ర‌మంలో చ‌దువు కాస్త డిస్టబ్ అయింది. అయినా చ‌దువు వ‌ద‌ల్లేదు. ఎలాగూ క‌ష్ట‌ప‌డి చ‌దివి డాక్ట‌ర్ ప‌ట్టా సంపాదించింది.

ఇప్పుడా ప‌ట్టాతోనే సొంతంగా ఆసుప‌త్రి నిర్మించే ప్లాన్ లో ఉందా? అంటే అవున‌నే వినిపిస్తుంది. కొద్ది రోజులుగా సాయి ప‌ల్ల‌వి ఆసుప‌త్రి నిర్మాణానికి కావాల్సిన అనుమ‌తులు కోసం తిరుగుతుందిట‌. కోయం బ‌త్తూరులో ఓ పెద్ద ఆసుప‌త్రి నిర్మించి ప్ర‌జ‌ల‌కు సేవ‌లందించాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటోందిట‌. ఈ క్ర‌మంలో ఆసుప‌త్రి నిర్మాణం ప‌నులు వీలైనంత‌ త్వ‌ర‌గా ప్రారంభించాల‌ని ప్లాన్ చేస్తోందిట‌.

వెనుక చెల్లి స‌హాయం కూడా ఉండ‌టంతో న‌టిగా తాను బిజీగా ఉన్న ఆసుప‌త్రి బాధ్య‌త‌లు త‌నకి అప్ప‌గించొచ్చు అన్న ఆలోచ‌న‌లో ఉందిట‌. అలాగే సాయి ప‌ల్ల‌వికి సినిమా అవ‌కాశాలు రాక‌పోయినా..న‌చ్చిన పాత్ర‌లు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఆఫ‌ర్ చేయ‌క‌పోయినా ఇంజెక్ష‌న్ చేసి బ్ర‌తికేస్తాను అని ఓ సంద‌ర్భంలో అంది. కెరీర్ డౌన్ ఫాల్ లో ఉన్నా? సొంత ఆసుప‌త్రి అంటూ ఒక‌టి ఉంటే న‌లుగురుకి ఉపాధితో పాటు..ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డానికి అవ‌కాశం ఉంటుంది. ఇలాంటి ఆలోచ‌న‌ల‌తోనే అమ్మ‌డు నిర్మాణ ప‌రంగా ముందుకెళ్తున్న‌ట్లు తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.