Begin typing your search above and press return to search.

మా అమ్మని ప్రేమతో ఉక్కిరిబిక్కిరి చేస్తా..అంటున్న నేచురల్ బ్యూటీ

By:  Tupaki Desk   |   13 Jun 2020 12:30 AM GMT
మా అమ్మని ప్రేమతో ఉక్కిరిబిక్కిరి చేస్తా..అంటున్న నేచురల్ బ్యూటీ
X
సాయిపల్లవి. ఈ బ్యూటీ పేరు దక్షిణ సినీ ఇండస్ట్రీకి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో శేఖర్‌ కమ్ముల డైరెక్షన్‌లో వచ్చిన ‘ఫిదా’ మూవీతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాలో సాయిపల్లవి తెలంగాణ యాసలో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేగాక ఈ నేచురల్ బ్యూటీ విభిన్నమైన సినిమాల ఎంపిక చేసుకుంటూ మంచి నటిగా పేరొందుతుంది. పాత్రకు తగ్గట్లుగా హావ భావాలను ఎంతో చక్కగా ప్రదర్శిస్తూ తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటుంది. ఈ చెన్నై భామ ప్రస్తుతం తెలుగులో ‘విరాట పర్వం’ సినిమా చేస్తోంది. అంతేగాక రెండోసారి శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో లవ్‌స్టోరీ అనే సినిమా చేస్తుంది. ఈ మూవీలో నాగచైనత్య హీరోగా నటిస్తున్నాడు. వీలు దొరికినప్పుడల్లా సాయిపల్లవి తన కుటుంబంతో గడపడానికి ప్రాధాన్యత ఇస్తుంది.

ఇక ప్రస్తుతం షూటింగ్స్ లేకుండా ఇంటి పట్టునే ఉంటున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అరుదుగా కనిపిస్తుంది. కానీ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ప్రతిసారి నెటిజన్ల హృదయాలు దోచుకెళ్తుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా అలాంటి పనే చేసింది. లాక్ డౌన్ నుండి సడలింపులు లభించడంతో సాయిపల్లవి తన తల్లిని వెంట తీసుకొని కారులో షికారుకు బయల్దేరిందట. అలా కారులో తీసుకెళ్లేటప్పుడు ఓ ఫోటో దిగింది. సాయిపల్లవి.. ఆమె తల్లి ఇద్దరు కారు అద్దాలలో నుండి తలలు బయటికి పెట్టారు. అయితే వెనక ఉన్న తల్లి అద్దంలో కనిపించడంతో అలా తల్లికి ముద్దు పెడుతున్నట్లుగా ఫోటో దిగింది. ఆ క్రేజీ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. "అవకాశం దొరికినప్పుడల్లా నా ప్రేమతో మా అమ్మను ఉక్కిరిబిక్కిరి చేసేస్తాను" అంటూ కాప్షన్ జోడించింది. వర్షం చినుకుల్లో తల్లి బిడ్డల ప్రేమ నెటిజన్ల మనసు దోచుకుంటోంది. ప్రస్తుతం వారి పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.