Begin typing your search above and press return to search.

సాయిప‌ల్ల‌వి పాత్ర‌పై పుష్ప‌-2 టీమ్ లో అన్ క్లారిటీ!

By:  Tupaki Desk   |   19 Dec 2022 4:30 PM GMT
సాయిప‌ల్ల‌వి పాత్ర‌పై పుష్ప‌-2 టీమ్ లో అన్ క్లారిటీ!
X
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప‌-దిరూల్ `షూటింగ్ జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. మొద‌టి భాగం `పుష్ప‌- ది రైజ్` అనూహ్య విజ‌యం సాధించ‌డంతో రెండ‌వ భాగాన్ని అంత‌ర్జాతీయ స్థాయిలోనే ప్లాన్ చేసి ముందుకెళ్తున్నారు. క‌థ‌లో కొన్ని ర‌కాల యూనిక్ అంశాలు జోడించారు. దీంతో రెండ‌వ భాగంలో అద‌నంగా చాలా కొత్త పాత్ర‌లు యాడ్ అవుతున్నాయి.

మొద‌టి భాగం ఉండే పాత్ర‌లు స‌హా కొత్త పాత్ర‌లు తెర‌పై కనిపించ‌నున్నాయి. క‌నిపించే ప్ర‌తీ పాత్ర‌కి అంతే ప్రాముఖ్య‌త ఉంటుంద‌ని తెలుస్తోంది. దీనిలో భాగంగా మరో హీరోయిన్ గా సాయి ప‌ల్ల‌విని తీసుకుంటున్న‌ట్లు సెట్స్ కి వెళ్ల‌డానికి ముందే క‌థ‌నాలు వైర‌ల్ అయ్యాయి. స్ర్కిప్ట్ రెండ‌వ నాయిక పాత్ర‌ని డిమాండ్ చేయ‌డంతో? సుకుమార్ సాయి ప‌ల్ల‌వి అయితే ఆపాత్ర‌కి న్యాయం చేయ‌గ‌ల‌ద‌ని విశ్వ‌సించి తీసుకుంటున్న‌ట్లు వెలుగులోకి వ‌చ్చింది.

అయితే ఆమె న‌టిస్తుందా? లేదా? అన్న దానిపై ఇంత వ‌ర‌కూ యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వ‌లేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రో కొత్త పాత్ర తెర‌పైకి వ‌స్తుంది. ఇందులో ఓ గిరిజ‌న యువ‌తి పాత్ర కీల‌కంగా ఉంటుందిట‌. ఆ పాత్ర‌కి ఐశ్వ‌ర్య రాజేష్ అయితే ప‌క్కాగా సూట‌వుతుంద‌ని మేక‌ర్స్ భావిస్తున్నారుట‌. ఇదే నిజ‌మైతే! ఇలాంటి పాత్ర‌ల్లో ఐశ్వ‌ర్యా రాజేష్ ఒదిగిపోతుంది.

ఆహార్యం స‌హా అన్ని ప‌క్కాగా సూట‌వుతాయి. కానీ ఇక్క‌డే మ‌రో డౌట్ కూడా రెయిజ్ అవుతోంది. ఇలా కొత్త పాత్ర ఎంట్రీ నేప‌థ్యంలో ఓ సందేహం వినిపిస్తుంది. సాయి ప‌ల్ల‌విని తీసుకోవాల‌న్న‌ది సెకెండ్ లీడ్ కా? లేక ఈ పాత్ర‌కా పాత్ర కోస‌మా? అని కొంత మంది సందేహం వ్య‌క్త చేస్తున్నారు. సాయి ప‌ల్ల‌వికి పాత్ర న‌చ్చితే ఎలాంటి రోల్ అయినా కమిట్ అవుతుంది.

అది చిన్న‌దా?..పెద్దదా? అని ఆలోచించ‌దు. న‌ట‌న‌న‌కు ఆస్కారం ఉన్న ఎలాంటి పాత్ర‌లోనైనా న‌టించే న‌టి ఆమె. మ‌రి ఈ మొత్తం గంద‌ర‌గోళం పై క్లారిటీ రావాలంటే? టీమ్ స‌భ్యులు స్పందించాల్సిందే. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.