Begin typing your search above and press return to search.
సాయిపల్లవి కంటి చూపులతోనే కట్టిపడేసిందబ్బా!
By: Tupaki Desk | 8 Dec 2021 1:30 PM GMTటాలీవుడ్ తెరపై గ్లామరస్ కథానాయికలు చాలామందే సందడి చేస్తున్నారు. కానీ వాళ్లందరి కంటే ఎక్కువగా సాయిపల్లవి పేరు వినిపిస్తుండటం విశేషం. అందుకు కారణం ఆమె సహజమైన నటన. పాత్ర ఏదైనా అది ప్రేక్షకుల మనసులకి దగ్గరగా తీసుకెళ్లడం ఆమె ప్రత్యేకత. సినిమా అనేది గ్లామర్ ప్రపంచం .. ఇక్కడ గ్లామర్ తో పెద్దగా పనిలేకుండా కెరియర్ ను నెట్టుకు రావడం కష్టం .. స్టార్ హీరోయిన్ అనిపించుకోవడం మరింత కష్టం. నటనను మాత్రమే నమ్ముకుని స్టార్ హీరోయిన్స్ అనిపించుకున్నవాళ్లు అతికొద్ది మంది మాత్రమే. ఆ జాబితాలో ఈ తరం హీరోయిన్ గా సాయిపల్లవి కనిపిస్తుంది.
నటనతో పాటు డాన్స్ సాయిపల్లవికి ఈ స్థాయి స్టార్ డమ్ రావడంలో ప్రధానమైన పాత్రను పోషించింది. ఇక సాయిపల్లవి కథల ఎంపిక .. పాత్రల ఎంపిక కెరియర్ పట్ల ఆమెకి గల పూర్తి అవగాహనకి అద్దం పడతాయి. పారితోషికం కంటే పాత్రకి ఆమె ప్రాముఖ్యతను ఇవ్వడమనేది ఆమె వ్యక్తిత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఒక సినిమాను సాయిపల్లవి ఒప్పుకుందంటే .. ఒక పాత్రను సాయిపల్లవి పోషిస్తుందంటే అందులో విషయం ఉంటుందనే ఒక నమ్మకం ఆడియన్స్ కి కలిగించింది. ఆ నమ్మకమే వాళ్లను థియేటర్ల వరకూ తీసుకువస్తోంది.
అలా ఇప్పుడు సాయిపల్లవి చేసిన సినిమానే 'శ్యామ్ సింగ రాయ్'. నాని సరసన ఆమె చేసిన ఈ సినిమాకి రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించాడు. కలకత్తా నేపథ్యంలో నడిచే ఈ సినిమా ఈ నెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిన్న 'సిరివెన్నెల' అనే పాటను విడుదల చేశారు. 'నెల రాజునీ .. ఇలా రాణిని కలిపింది కదా సిరివెన్నెల' అంటూ సాగే ఈ పాటకి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. తేనెలో తీయదనం .. సిరివెన్నెల సాహిత్యంలో పదాల పరిమళం ఉండటం సహజమనే విషయాన్ని ఈ పాట మరోసారి నిరూపించింది.
సిరివెన్నెల సీతారామశాస్త్రి చివరిసారిగా రాసిన ఈ పాటను మిక్కీ జె మేయర్ స్వరపరిచాడు. నాని - సాయిపల్లవిపై చిత్రీకరించిన ఈ పాట అందంగా .. ఆహ్లాదంగా సాగిపోతోంది. ఈ పాటలో బెంగాలీ చీరకట్టులో సాయిపల్లవి చాలా అందంగా కనిపిస్తోంది. దీపాల వెలుగుల్లో ఆమె కళ్లు కూడా దీపాలుగానే అనిపిస్తున్నాయి. పెద్ద బొట్టు .. ముక్కుకు బేసర .. బెంగాలీ సంప్రదాయపు చీరకట్టు సాయిపల్లవికి మరింత అందాన్ని తీసుకొచ్చాయి. సోషల్ మీడియాలోను ఇప్పుడు ఈ విషయాన్ని గురించే మాట్లాడుకుంటున్నారు. తెరపై ఆమె ఎక్కువసేపు కనిపించాలని కోరుకుంటున్నారు. సాయిపల్లవి మరోసారి మేజిక్ చేయనుందంటూ, ఆమె పాత్రపై అంచనాలు పెంచుకుంటున్నారు.