Begin typing your search above and press return to search.

సాయి పల్లవి చీటింగ్‌.. ఆపై క్షమాపణలు

By:  Tupaki Desk   |   31 May 2019 6:00 AM GMT
సాయి పల్లవి చీటింగ్‌.. ఆపై క్షమాపణలు
X
సినిమాల విడుదల సమయంలో హీరోలు.. హీరోయిన్స్‌.. ఇంకా ఇతర టెక్నీషియన్స్‌ సోషల్‌ మీడియాలో అభిమానులతో చిట్‌ చాట్‌ చేస్తూ ఉంటారు. సినిమాకు సంబంధించిన విషయాలు మరియు ఇతరత్ర విషయాల గురించి అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఉంటారు. ఎలక్ట్రానిక్‌ మీడియా.. ప్రింట్‌ మీడియా వారు అడగలేని కొన్ని ప్రశ్నలు సోషల్‌ మీడియాలో చిట్‌ చాట్‌ సమయంలో సెలబ్రెటీలు సమాధానం చెబుతూ ఉంటారు.

సోషల్‌ మీడియాలో సెలబ్రెటీల చిట్‌ చాట్‌ పై అందరు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. తాజాగా 'ఎన్జీకే' చిత్రం ప్రమోషన్‌ లో భాగంగా సాయి పల్లవి కూడా సోషల్‌ మీడియాలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తానంటూ ఒక టైం ను ఫిక్స్‌ చేసింది. ఆ టైం వరకు అభిమానుల నుండి వేల సంఖ్యలో సాయి పల్లవికి ప్రశ్నలు వచ్చాయి. అయితే ఏదో కారణం వల్ల సాయి పల్లవి ముందుగా అనుకున్న ప్రకారం అభిమానులతో చాట్‌ చేయలేక పోయింది.

సాయి పల్లవి లైవ్‌ కు వస్తానంటూ చెప్పి రాకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆమెను ఏవో ఏవో ప్రశ్నలు అడగాలని భావించిన వారు నిరుత్సాహ పడ్డారు. దాంతో కొందరు ఆమెపై రివర్స్‌ అయ్యారు. మా సమయం వృదా చేసుకుని నీతో లైవ్‌ చాట్‌ పై ఆసక్తిగా ఎదురు చూస్తుంటే నువ్వు చీటింగ్‌ చేశావు.. చాటింగ్‌ కు రాలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో సాయి పల్లవి తప్పనిసరి పరిస్థితుల్లో క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. మరెప్పుడైనా సోషల్‌ మీడియాలో కలుద్దాం అంటూ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అందుకే సోషల్‌ మీడియాలో సెలబ్రెటీలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సాయి పల్లవి సంఘటనతో మరోసారి సెలబ్రెటీలకు తెలిసి వచ్చింది.