Begin typing your search above and press return to search.

ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ సీన్లు చేయ‌ను

By:  Tupaki Desk   |   16 Jan 2018 5:30 PM GMT
ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ సీన్లు చేయ‌ను
X
టాలీవుడ్ లో కొంత‌మంది హీరోయిన్లు కెరీర్ బిగినింగ్ లో ఓ మోస్త‌రుగా గ్లామ‌ర్ ఒల‌క‌బోసినా....ఆ త‌ర్వాత డోసు పెంచేయ‌డం వంటివి చేస్తుంటారు. ఆయా పాత్రల డిమాండ్ వ‌ల్ల...ద‌ర్శ‌క నిర్మాత‌లు చెప్పిన‌ట్లుగా గ్లామ‌ర్ రోల్స్ లో న‌టించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితులు కూడా ఉంటాయి. అయితే, ఎట్టిప‌రిస్థితుల్లోనూ తాను పూర్తి స్థాయి గ్లామ‌ర్ పాత్ర‌ల‌ను చేయ‌బోన‌ని `ఫిదా`బ్యూటీ సాయి ప‌ల్ల‌వి తెగేసి చెప్పేసింది. త‌న దృష్టిలో అందాల ఆరబోతే గ్లామర్ కాద‌ని, మొఖంపై మొటిమ‌లున్నా కూడా తాను అందంగా క‌నిపిస్తాన‌ని చెప్పుకొచ్చింది. గ్లామ‌ర్ పాత్ర‌ల‌లో న‌టించ‌మ‌ని త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన ద‌ర్శ‌నిర్మాత‌ల‌కు ఇదే విష‌యాన్ని చెప్పాన‌ని....దానిని వారు వేరేవిధంగా అర్థం చేసుకున్నార‌ని తెలిపింది. ఓ చానెల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో సాయి ప‌ల్ల‌వి త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టింది.

త‌న‌కు కొంత‌మంది నిర్మాత‌లు ఎక్కువ డ‌బ్బులిస్తామ‌ని, గ్లామర్ గా కనిపించమని కోరార‌ని తెలిపింది. అయితే, గ్లామర్‌ అంటే కేవ‌లం స్కిన్ షో కాద‌ని, అందాల ఆరబోత త‌న‌కు ఇష్టం ఉండద‌ని చెప్పానంది. దీంతో, వారు తాను కండిషన్లు పెడుతున్నాన‌ని ప్ర‌చారం చేశార‌ని, అలా అనుకుంటే తానేమీ చేయ‌లేన‌ని తెలిపింది. కథ చెప్ప‌కుండా ఫ‌లానా హీరోతో మీరు న‌టిస్తారా....అని అడుగుతార‌ని, త‌న‌ దృష్టిలో కథే హీరో అని చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లోనూ లిప్‌లాక్ లు వంటివి చేయ‌న‌ని, తాను మధ్య తరగతి అమ్మాయిన‌ని చెప్పింది. అందాల ఆర‌బోత‌ల‌కు త‌న‌ పేరెంట్స్‌ ఒప్పుకోర‌ని, లిప్ లాక్ సీన్ల‌లో న‌టించ‌క‌పోవ‌డంతోపాటు త‌న‌కు మ‌రికొన్ని కండిషన్లు పెట్టాకే సినిమాల్లో న‌టించ‌డానికి ఒప్పుకున్నార‌ని తెలిపింది.