Begin typing your search above and press return to search.

అప్పుడే మూడో సినిమా కూడానా..

By:  Tupaki Desk   |   22 July 2017 9:20 AM GMT
అప్పుడే మూడో సినిమా కూడానా..
X
ప్రేమమ్ సినిమాతో అందరిని మ్యాజిక్ చేసిన మలయాళం అమ్మాయి సాయి పల్లవి ఇప్పుడు తెలుగులో భలే పాపులర్ అయిపోయింది. తెలుగులో మొదటి సినిమా విడుదల కాకముందే సాయి పల్లవి ఎవరో ఏంటో మన తెలుగు ప్రేక్షకులుకు ముందుగానే తెలియడంతో.. ఫిదా సినిమాకు కూడా ప్లస్ అయ్యింది. ఇక ఫిదా తెచ్చిన గుర్తింపు అటుంచితే.. అప్పుడే ఈమె మూడో సినిమా కూడా సైన్ చేసింది తెలుసా!!

మొదటి తెలుగు సినిమాతోనే తెలుగులో తన సినిమాకు తానే డబ్బింగ్ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. సాయి పల్లవి డాన్స్ ఆమె నటనతో ఫిదా సినిమాలో మ్యాజిక్ చేసింది అని చెబుతున్నారు చూసే వాళ్ళు. ఇప్పుడు అదే జోష్ తో మరో సినిమా చేయడానికి సిద్దమైందీ తమిళ కుట్టి. ఇప్పటికే నాని సినిమా MCA లో హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమాను కూడా దిల్ రాజే ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇప్పుడు మరో యంగ్ హీరో శర్వానంద్ తో కూడా నటించబోతుందని టాక్. సుధీర్ వర్మ డైరెక్ట్ చేయబోతున్న రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాలో సాయి పల్లవి నటించే అవకాశం ఉందట. సూర్యదేవరా నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగష్టు లో మొదలుకాబోతుంది. శర్వానంద్ రాబోతున్న సినిమా మహానుభావుడు షూటింగ్ పూర్తవ్వగానే సాయి పల్లవితో రొమాన్స్ చేస్తాడని అంటున్నారు.

ఫిదా సినిమాతో సాయి పల్లవికి తెలుగు ప్రేక్షకులు మంచి స్వాగతమే పలికారు అనే చెప్పాలి. మరి ఈమె తెలుగు సినిమా ప్రయాణం ఎలా ఉండబోతుంది చూద్దాం.​ ఎందుకంటే కొంతమంది హీరోయిన్లు ఒకలాంటి పాత్రను ఎక్కువసార్లు చేస్తే జనాలు చూడలేరు. అందుకే శేఖర్ కమ్ముల సినిమాలతో ఎంట్రీ ఇచ్చిన కమిలినీ ముఖర్జీ.. నీతూ చంద్ర లాంటి భామలో ఎక్కడా కనిపించకుండా మాయం అయిపోయారు. అది సంగతి.