Begin typing your search above and press return to search.
ప్రియకి పల్లవి ఇస్తున్న సలహా!!
By: Tupaki Desk | 27 Feb 2018 3:30 PM GMTఇప్పుడు ప్రియా ప్రకాష్ వారియర్.. సోషల్ మీడియా సెన్సేషన్ అనే సంగతి తెలిసిందే. కానీ కొన్నేళ్ల క్రితం ఇలా ఒక వీడియోతో కాకపోయినా.. ఒక్క సినిమాతో సూపర్ సెన్సేషన్ అయిపోయింది సాయిపల్లవి. ప్రేమమ్ మూవీలో మలార్ పాత్రతో కుర్రకారును బుట్టలో వేసేసుకుంది. మరి ఇప్పుడు కొత్త సెన్సేషన్ కి పాత సెన్సేషనల్ బ్యూటీ ఎలాంటి సలహా ఇస్తుందో అనే ఆసక్తి అయితే సహజం.
'సరైన సినిమాలు ఎంచుకోమని చెబుతాను. నా వరకు చూస్తే ఒకే ఒక్కసినిమాతో బోలెడంత గుర్తింపు వచ్చింది. కానీ దాంతో పాటే చాలానే బాధ్యతలు కూడా వచ్చాయి. ప్రేమమ్ లేకుండా ఓ 10 సినిమాలు చేసేసినా నాకు ఇంతటి గుర్తింపు వస్తుందా అంటే సందేహమే. అంతటి రికగ్నిషన్ ఆ సినిమా ఇచ్చింది. ఇప్పుడు ప్రియకు కూడా అలాంటి గుర్తింపే వచ్చింది. దాన్ని సరైన పద్ధతిలో ఉపయోగించుకోవాలని సూచిస్తాను. గుర్తింపు రావడం కంటే.. దాన్ని కాపాడుకోవడం చాలా కష్టమైన విషయం అనే అంశం గుర్తుంచుకోవాలి' అంటూ తన అనుభవాన్ని రంగరించి మరీ సలహా ఇచ్చింది సాయిపల్లవి.
అప్పట్లో ప్రేమమ్ లో ఒరిజినల్ అందంతో ఈమె చేసిన హంగామా అంతా ఇంతా కాదు. కేరళతో పాటు దక్షిణాది మొత్తం మలార్ అంటూ ఈమె జపంలో మునిగిపోయేవారు. ఇప్పుడు ప్రియా ప్రకాష్ వారియర్ కూడా అంతే. ఇదే క్రేజ్ ను నిలబెట్టుకోగలిగితే మరో సాయిపల్లవి అయిపోయినట్లే.