Begin typing your search above and press return to search.
నాకు సినిమా పిచ్చి అని దేవుడికి తెలుసేమో!
By: Tupaki Desk | 23 Dec 2021 4:00 AM GMTనాని తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'శ్యామ్ సింగ రాయ్' రెడీ అవుతోంది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, రేపే భారీస్థాయిలో థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో ఒక వైపున నాని .. మరో వైపున సాయిపల్లవి ఇద్దరూ కూడా ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమాను గురించి సాయిపల్లవి మాట్లాడింది. " ఈ సినిమాలో నేను దేవదాసీ పాత్రలో కనిపిస్తాను. ట్రైలర్ లో మీకు తెలిసేది కొంత మాత్రమే గనుక, సినిమా చూసినవారికి తప్పకుండా ఆ పాత్ర కనెక్ట్ అవుతుంది.
ఏ సినిమాలో ఏ పాత్రను చేసినా ఆ పాత్రను నేను ఓన్ చేసుకుంటాను. 'ఫిదా' తరువాత ఆ పాత్ర నుంచి బయటకి రావడానికి నాకు రెండు మూడు నెలలు పడుతుంది. 'లవ్ స్టోరీ' చేసిన తరువాత ఆ పాత్ర ప్రభావం వలన కొన్ని రోజులు నేను అలాగే ఉన్నాను. ఒక పాత్ర నా నుంచి ఏమి కోరుకుంటుందో అంత నా నుంచి ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. 'శ్యామ్ సింగ రాయ్'లో నేను చేసిన దేవదాసీ పాత్ర ద్వారా, వాళ్లంతా ఎంత ఇన్నోసెంట్ గా ఉంటారనేది చెప్పాలనుకున్నాను.
అయితే ఈ సినిమా మొత్తం కూడా దేవదేసీల కష్టసుఖాలు చూపించడం జరగదు. 'శ్యామ్ సింగ రాయ్'తో ముడిపడిన ఒక దేవదాసీ పాత్ర పరిథి ఎంతవరకూ ఉంటుందో, అంతవరకే చూపించడం జరుగుతుంది. ఈ పాత్రపై నేను కొంత రీసెర్చ్ చేసిన తరువాతనే రంగంలోకి దిగాను. నాకు సినిమాలంటే ఎంత పిచ్చో దేవుడికి తెలుసునేమో అందుకే ఇలాంటి మంచి పాత్రలను దక్కేలా చేయగలుగుతున్నాడు. సాయిపల్లవి అయితే ఇలాంటి పాత్రలు బాగా చేయగలుగుతుందని దర్శకులు అనుకోవడం కూడా నా అదృష్టమే. అయితే మంచి కథలు ఎప్పుడూ రావు .. వచ్చినప్పుడు వాటికి న్యాయం చేయడంలో కలిగే సంతోషం .. సంతృప్తి వేరు.
అప్పట్లో దేవదాసీలు అలా ఉంటారనీ .. వాళ్ల కట్టూబొట్టూ అలా ఉండేవని తెలిసి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. వాళ్లు ధరించిన కాస్ట్యూమ్స్ లో కనిపించడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. సందేశంతో కూడిన కమర్షియల్ హిట్ సినిమాలనే ఎంచుకుంటున్నారా? అని నన్ను అంతా అడుగుతున్నారు. నిజానికి అలాంటిదేమీ ప్లాన్ చేయలేదు. నన్ను దృష్టిలో పెట్టుకుని దర్శకులు డిజైన్ చేసిన పాత్రలనే నేను చేస్తూ వస్తున్నాను. అలాంటి సినిమాలను ఆదరించడం ప్రేక్షకుల గొప్పతనం. కొన్ని భావాలను మాటలతో చెబితే బాగుంటుంది. మరికొన్ని భావాలను కళ్లతో చెబితేనే బాగుంటుంది. ఈ సినిమాలో కళ్లతో నేను పలికించే భావాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయని నేను అనుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చింది.