Begin typing your search above and press return to search.
సాయి పల్లవి డ్యూయల్ సిమ్ పోటీ
By: Tupaki Desk | 4 Dec 2018 9:20 AM GMTకొన్నిసార్లు మన సినిమాతో మన సినిమానే పోటీ పడాల్సి రావడం కొంత వింతగా ఉంటుంది. సాయి పల్లవికి అచ్చం అలాంటి పరిస్థితే ఎదురు కాబోతోంది. డిసెంబర్ 21న శర్వానంద్ తో నటించిన పడి పడి లేచే మనసు ఇప్పటికే కన్ఫర్మ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తనదే మరో సినిమా కూడా అదే డేట్ కి కర్చీఫ్ వేసుకుంది. ధనుష్ మారి 2 ఇదే తేదిని అఫీషియల్ గా లాక్ చేసుకుంది. ఒకేరోజు రెండు డిఫరెంట్ జానర్స్ సినిమాలతో పోటీ పడాల్సి రావడం సాయి పల్లవికి ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు.
పడి పడి లేచే మనసు లవ్ స్టొరీ కాగా మారి 2 ఊర మాస్ మాఫియా కథ. శర్వానంద్ సినిమాలో మెడికో కాగా మారి 2లో సాయి పల్లవి ఆటో డ్రైవర్. ఒకదానికి ఒకటి ఏ మాత్రం సంబంధం లేని పాత్రలు కావడం విశేషం. మరో ట్విస్ట్ కూడా ఉంది. ఈ ఇద్దరు హీరోలతో సాయి పల్లవి మొదటిసారి కలిసి నటిస్తోంది. మారి 2 తెలుగులో డబ్ అయ్యే అవకాశాలు తక్కువ. అదే రోజు ఇప్పటికే పడి పడి లేచే మనసుతో పాటు అంతరిక్షం-కేజిఎఫ్-జీరోలు షెడ్యూల్ చేసారు. ధియేటర్ల కొరత ఇబ్బందిగా ఉంటుంది. ఈ నేపధ్యంలో మారి 2 తెలుగులో వచ్చే ఛాన్స్ లేనట్టే. ఒకవేళ చేయాలి అనుకుంటే ఇంత పోటీ మధ్య కష్టమే.
పైగా విఐపి 2 తర్వాత ధనుష్ సినిమాలు తెలుగులో డబ్ కావడం లేదు. ఇటీవలే విడుదలైన వడ చెన్నై మనదాకా రాలేదు. సో మారి 2 అనుమానంగానే ఉంది. మారి ఫస్ట్ పార్ట్ తెలుగులో మాస్ పేరుతో డబ్ అయ్యింది. కాజల్ అగర్వాల్ హీరొయిన్ గా చేసిన ఆ మూవీ ఇక్కడ అంతగా ఆడలేదు. మారి 2 మీద తమిళ్ లో మంచి అంచనాలే ఉన్నాయి ఏదైతేనేం సాయి పల్లవి తనతో తనే పోటీ పడాల్సిన పరిస్థితి డిసెంబర్ 21 వస్తోంది. అంటే ఒకే ఫోన్ లో రెండు సిమ్ములు ఉన్నట్టు ఒకే సాయి పల్లవి రెండు బాషలలో పోటీ పడాలి.