Begin typing your search above and press return to search.
మాల్దీవుల బీచ్ పై సాయి పల్లవి మనసులో మాట!
By: Tupaki Desk | 2 Aug 2022 2:30 AM GMTహీరోయిన్లందరి ఫేవరెట్ వెకేషన్ స్పాట్ మాల్దీవులు. సమయం చిక్కితే బ్యూటీలన్నీ మాల్దీవుల్లో రెక్కలు కట్టుకుని వాలిపోతుంటాయి. అక్కడి బీచ్ లో...రిస్టార్స్ట్ లో...స్పా సెంటర్లలో అందాలన్నీ సేద తీరుతుంటాయి. అన్ని రకాల సౌకర్యాలున్న బీచ్ అది. ప్రపంచంలో ఎన్నో బీచ్ లున్నా...సెలబ్రిటీలకు ఎంతో ప్రత్యేకమైన బీచ్ స్పాట్ అది.
ఆ తర్వాత భారత్ లో గోవా తీరం అంతటి ఖ్యాతిగండిచింది. మరి ఇలాంటి బీచ్ అందాల ఆస్వాదన సాయి పల్లవికి కూడా అంతే ఇష్టమా? అంటే ? అవుననే తెలుస్తోంది. అయితే వాళ్లలా టూపీస్ బికినీలు...స్విమ్ షూట్లు ధరించి తీరంలో దొర్లడం వంటి వాటికి పల్లవి ఎంతో దూరం. బీచ్ అందాల్ని ఎంతో పద్దతిగా..హుందాగా మాత్రమే ఆస్వాదిస్తుంది.
ప్రపంచంలో మరెన్నో అందాలు..అద్భుతాలు ఉండగా సముద్రం తీరాన్నే ఎందుకు ఇష్టపడతారంటే? అందుకు కారణం లేదంటుంది. బీచ్ వద్ద అలా నిలబడి సముద్రాన్ని చూస్తూ ఉంటే కలిగే అనుభూతి మాటల్లో వర్ణించలేను అంటుంది. ఆ సమయంలో మనసు ప్రశాంతం చేసుకుని జ్ఞానం చేసిన ఫీలింగ్ కల్గుతుందని మనసులో భావాల్ని బయటపెట్టింది.
బీచ్ తర్వాత ఎక్కువగా పుస్తకాలు చదవడం అంటే ఇష్టమంట. సినిమా స్ర్కిప్ట్ ని కూడా ఓ పుస్తకంలా భావించి చదువుతుందిట. కథలో ప్రతీ అంశాన్ని ఎంతో అర్ధం చేసుకోవడాని కి ప్రయత్నిస్తుందిట. ఆ కథలో ఎక్కడ సం దేహం వచ్చినా నిర్మొహమాటంగా వాటిని నివృత్తి చేసుకుంటుందిట. ఇవన్నీ సాయి పల్లవిలో గొప్ప లక్షణాలు.
ఇవే మిగతా హీరోయిన్ల నుంచి పల్లవిని వేరు చేస్తున్నాయి. నలుగురు భామల దారికి పల్లవి వ్యతిరేకం. తనకంటూ ప్రత్యేకమైన మార్గాన్ని తానే నిర్మించుకుని ఒక్కర్తే నడుస్తుంది.
అందుకే సాయి పల్లవి అంటే యువత లో అంత ప్రత్యేకం. ప్రస్తుతం ఈ బ్యూటీ నటిగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆమె నటించిన `విరాట పర్వం` ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. విమర్శకుల ప్రశంలందుకున్న చిత్రంగా నిలిచింది. ఓటీటీలోనూ మంచి ఆదరణ దక్కించుకుంది.