Begin typing your search above and press return to search.

పూరి ఫ్యామిలీ నుంచి కొత్త డైరెక్టర్

By:  Tupaki Desk   |   18 Oct 2017 4:22 AM GMT
పూరి ఫ్యామిలీ నుంచి కొత్త డైరెక్టర్
X
పూరి జగన్నాథ్ బ్యాకప్ తో హీరోగా మారాడు ఆయన తమ్ముడు సాయిరాం శంకర్. స్వయంగా పూరీనే ‘143’ సినిమాతో సాయిరాంను హీరోగా పరిచయం చేశాడు. తమ్ముడు హీరోగా ‘బంపర్ ఆఫర్’తో పాటు రెండు మూడు సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేశాడు. పూరి సపోర్టుతో వేరే వాళ్లు కూడా ముందుకొచ్చి సాయిరాంతో సినిమాలు తీశారు. కానీ ఇంత బ్యాకప్ ఉన్నా సాయిరాం హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు. ఫ్లాపుల మీద ఫ్లాపులు కొట్టి హీరోగా బాగా వెనుకబడిపోయాడు. సాయిరాం నుంచి చివరగా వచ్చిన ‘ఈడోరకం’ కూడా ఆడలేదు. అతడి సినిమాలు ఒకట్రెండు విడుదలకే నోచుకోకుండా ఆగిపోయాయి.

ఇలాంటి పరిస్థితుల్లో సాయిరాం ఇంకో కొత్త సినిమా మొదలుపెడుతున్నాడు. ఈ చిత్రానికి దర్శకుడు కూడా అతనేనట. ఓ కొత్త నిర్మాత తనతో సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చాడట. సాయిరాం హీరో కావడానికి ముందు తన అన్నయ్య దగ్గరే దర్శకత్వ విభాగంలో పని చేశాడు. ముందు అతను హీరో కావాలనే అనుకున్నాడు. కానీ అనుకోకుండా ‘ఇడియట్’ సినిమాలో చిన్న పాత్ర చేశాడు. దాంతో యాక్టింగ్ మీదికి మనసు మళ్లింది. ఆపై హీరోగా లాంచ్ అయ్యాడు. ఐతే పూరీనే సాయిరాంను హీరోగా నిలబెట్టలేకపోయాడు. వేరే దర్శకులూ అతడికి సక్సెస్ ఇవ్వలేకపోయారు. మరి సాయిరాం తనను తాను హీరోగా నిలబెట్టుకుంటాడేమో చూద్దాం.