Begin typing your search above and press return to search.

‘స్పైడర్’ గురించి ఆ భయం వదిలేయండి

By:  Tupaki Desk   |   7 Sep 2017 5:30 PM GMT
‘స్పైడర్’ గురించి ఆ భయం వదిలేయండి
X
స్పైడర్’ టీజర్లో చాలామంది ఎత్తి చూపిన లోపం.. విలన్ పాత్రధారి ఎస్జే సూర్య వాయిస్. తమిళ జనాలకు అతడి వాయిస్ ఎలా అనిపిస్తుందో ఏమో కానీ.. మనోళ్లకు మాత్రం అతడి గొంతు ఇబ్బందిగా అనిపించింది. సూర్య తమిళ యాసలో తెలుగు డైలాగులు చెప్పడం మన వాళ్లకు రుచించలేదు. దీనిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా జరిగింది. ఐతే ఈ నెగెటివ్ ఫీడ్ బ్యాక్ మురుదాస్ వరకు చేరడంతో సినిమాలో సూర్య వాయిస్ కంటిన్యూ చేయడంపై పునరాలోచనలో పడిపోయినట్లు తెలిసింది. అతడికి డబ్బింగ్ చెప్పడానికే నిర్ణయించుకున్నారట. ఇందుకోసం ఓ ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్టునే పిలిపించడం విశేషం.

డబ్బింగ్ కింగ్ సాయికుమార్ తమ్ముడు రవిశంకర్.. ‘స్పైడర్’లో ఎస్జే సూర్య పాత్రకు డబ్బింగ్ చెప్పినట్లు సమాచారం. రవిశంకర్ వాయిస్ ఎంత ఫేమస్సో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ‘అరుంధతి’ సినిమాలో పశుపతి పాత్రకు తన వాయిస్ తోనే ప్రాణం పోసి.. ఆ సినిమాకు తెర వెనుక హీరోగా నిలిచాడు రవిశంకర్. సూర్య పాత్రకు అతడి డబ్బింగ్ బాగానే కుదిరిందని.. సినిమాకు అది ప్లస్ అవుతుందని అంటున్నరు. ఇంకో వారం రోజుల్లో రాబోతున్న ‘స్పైడర్’ ట్రైలర్లో రవిశంకర్ వాయిసే వినిపిస్తుందట. అప్పుడు సూర్య పాత్ర విషయంలో ఉన్న ఫీలింగ్ అంతా పోతుందని.. భయాలు తొలగిపోతాయని అంటున్నారు. ఈ నెల 9న ‘స్పైడర్’ ఆడియో విడుదల కాబోతుండగా.. 15న హైదరాబాద్ లో ప్రి రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు.