Begin typing your search above and press return to search.

శారీర‌క బంధానికి న‌ష్ట‌ప‌రిహారం కోరుకోను!-సాయి సుధ‌

By:  Tupaki Desk   |   3 Jun 2020 7:10 AM GMT
శారీర‌క బంధానికి న‌ష్ట‌ప‌రిహారం కోరుకోను!-సాయి సుధ‌
X
సినిమాటోగ్రాఫ‌ర్ శ్యామ్.కే నాయుడిపై న‌టి శ్రీ సాయి సుధ చీటింగ్ కేసు పెట్టిన సంగ‌తి తెలిసిందే. సంజీవ్ న‌గ‌ర్ (హైద‌రాబాద్) పోలీసులు ప్ర‌స్తుతం ఈకేసును ద‌ర్యాప్తు చేస్తున్నారు. శ్యామ్.కే త‌న‌ని పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించి మోసం చేశాడ‌ని.. త‌న‌ని ప్ర‌శ్నిస్తే ఇప్పుడు ముఖం చాటేస్తున్నాడ‌ని.. ఆయ‌న కుటుంబ స‌భ్యులు మోసం చేశార‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు చేసారు సాయి సుధ‌. ఈ వ్య‌వ‌హారంలో తాను చాలా డ‌బ్బు న‌ష్ట‌పోయాన‌ని.. శారీర‌కంగా మాన‌సికంగా త‌న‌కు బోలెడంత న‌ష్టం జ‌రిగింద‌ని సాయి సుధ తాజా ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు.

వెంక‌టేష్ బాడీగార్డ్ షూటింగ్ స‌మ‌యంలో శ్యామ్ కేతో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆ త‌ర్వాత షాడో షూటింగ్ లోనూ క‌లిశాం. ఆ క్ర‌మంలోనే సోష‌ల్ మీడియా చాటింగ్ .. అనంత‌రం ఫోన్ నంబ‌ర్లు షేర్ చేసుకున్నాం. త‌ర్వాత ఆయ‌న నాకు ప్ర‌పోజ్ చేసారు. దానికి ఓకే అన్నాను. అయితే అప్ప‌టికి త‌న భార్య‌తో గొడ‌వ‌లున్న సంగ‌తి నాకు తెలీదు అని సాయి సుధ తెలిపారు.

గొడ‌వ‌లు స‌ద్ధుమ‌ణుగుతాయ‌నే అనుకుంటే.. ఆయన భార్య నాకు ఓరోజు ఫోన్ చేసి బెదిరించారు. దాంతో ఆయనను నిలదీశాను. దానివల్ల మా ఇద్ద‌రి మ‌ధ్యా గొడవలు మొదలయ్యాయి. ఇక ఆయనతో నాకు సరిపడదని నేను గ్రహించి బ్రేకప్ చెబుదామని అనుకొన్నాను. కానీ ఈలోగానే కొంద‌రు ‌మ‌మ్మ‌ల్ని క‌లిపారు అని తెలిపారు. అయితే ఇప్ప‌టికీ శ్యామ్.కే కి భార్య‌తో గొడ‌వ‌లు సద్ధుమ‌ణ‌గ‌లేదు. అలాగే కొన‌సాగుతున్నాయి. దీంతో నేను పెళ్లి చేసుకుందామ‌నే విష‌యాన్ని ఆయ‌న‌కు చెప్పాను. కానీ న‌న్ను దూరం పెట్టారు. అందుకే కేసు పెట్టాను.. అని సాయి సుధ తెలిపారు.

అత‌డి వ‌ల్ల‌ శారీరకంగా.. మానసికంగా.. ఆర్థికంగా నష్టపోయాను. ఆయన ఖర్చుల‌న్నీ నేనే భ‌రించాను. చాలా డ‌బ్బు న‌ష్ట‌పోయాను. అది ఎంత అంటే చెప్ప‌లేను. బంధంలో ఇవ‌న్నీ లెక్క‌పెట్ట‌లేం క‌దా? ఫిజిక‌ల్ బంధం .. ఎమోష‌న‌ల్ బాండింగ్ ఉంది. అందుకే అత‌డు నాకు కావాల‌ని కోరుకున్నాను. అందుకే కేసు పెట్టాను. ఇప్పుడు ఆయ‌న వ‌ల్ల న‌ష్ట‌పోయిన డ‌బ్బు నాకు కావాలి. అయితే ఆయనతో ఉన్న శారీరక బంధానికి నష్టపరిహారం.. సెటిల్ మెంట్ కోసం ఎదురు చూడటం లేదు అని సాయి సుధ ఆవేదన వ్యక్తం చేశారు. అత‌డి వ‌ల్ల న‌ష్టం అంతా ఇంతా కాదు. నేను నా కుటుంబాన్ని వ‌దులుకుని దూరంగా బ‌త‌కాల్సి వ‌స్తోంది. ఒంట‌రిత‌నం అనుభ‌వించాల్సిన ప‌రిస్థితి ఉంది. అయినా పెళ్ల‌యిన వాడితో బంధం స‌రైన‌దేనా కాదా? అన్న‌ది ప్ర‌శ్నే కాదు. అయితే క‌మిట‌వ్వ‌డానికి ముందు అత‌డి క్యారెక్ట‌ర్ ఎలాంటిదో తెలుసుకోవాల్సింది అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు సాయి సుధ‌.