Begin typing your search above and press return to search.
పుడితే కర్నూల్లో బుట్టాలా .. చూస్తే 'కొండ పొలం' సినిమా జూడాలా
By: Tupaki Desk | 3 Oct 2021 11:30 AM GMT'మా భూమి' .. 'మంచు పల్లకి' వంటి సినిమాలతో తన కెరియర్ ను ప్రారంభించిన సాయిచంద్, చాలా గ్యాప్ తరువాత రీ ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా 'కొండ పొలం' సినిమాలోను ఆయన ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు. వైష్ణవ్ తేజ్ .. రకుల్ నాయకా నాయికలుగా దర్శకుడు క్రిష్ ఈ సినిమాను రూపొందించారు. సాయిచంద్ తో పాటు కోట శ్రీనివాసరావు .. నాజర్ .. రవిప్రకాశ్ .. హేమ ముఖ్యమైన పాత్రలను పోషించారు. నిన్న రాత్రి ఈ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ ను కర్నూల్లో నిర్వహించారు. ఈ వేదికపై సాయిచంద్ కర్నూల్ యాసలో సందడి చేశారు.
" నేను పుట్టింది కర్నూల్లోనే .. నాకు నాలుగు నెలలు ఉన్నప్పుడే హైదరాబాద్ కి వెళ్లిపోయాము. అయినా కర్నూల్ తో నాకు ఉన్న సెంటిమెంట్ ఎప్పుడూ గుర్తుకు వచ్చేది. కర్నూల్ యాసలో మాట్లాడాలని ఉండేది. 'మా భూమి'కి తెలంగాణ యాసలో మాట్లాడాను. 'ఎర్ర మల్లెలు'లో ఒంగోలు యాస .. మరో సినిమాలో శ్రీకాకుళం యాస .. ఇలా మాట్లాడుతూ వచ్చాను. 'ఉప్పెన'లో గోదావరి జిల్లా యాసలో మాట్లాడాను. 'సైరా' సినిమాలో సుబ్బయ్య పాత్ర వచ్చింది. కానీ అది నెల్లూరి యాస కాదు అన్నారు.
నెల్లూరి యాసలో మాట్లాడాలనే నా కోరిక 'కొండ పొలం' సినిమాతో తీరింది. నేనైతే నల్లమల అడవులు చూడలేదు. కానీ 'కొండ పొలం' నవల చదువుతున్నప్పుడు నల్లమల అడవులతో చాలా పరిచయమైపోతుంది. అలాంటి నవలను క్రిష్ గారు సినిమా తీయాలనుకోవడం ఒక శుభకార్యం వంటిదే. ఒకప్పుడు తెలుగు సాహిత్యానికి .. తెలుగు సినిమాకి చాలా అనుబంధం ఉండేది. ఆ బంధం ఎందుకో చాలా ఏళ్ల క్రితమే తెగిపోయింది. మళ్లీ ఈ సినిమాతో పూర్వ వైభవం వస్తుందని ఆశిస్తున్నాను.
క్రిష్ గారితో కలిసి పనిచేయడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. ఆయనకి మంచి సాహిత్య పరిజ్ఞానం ఉంది .. తాను చిత్రీకరించే సన్నివేశాలపై పూర్తి క్లారిటీ ఉంది. ఆయనతో కలిసి పనిచేస్తుంటే .. దర్శకులు 'బాపు' గారి దగ్గర పనిచేస్తున్నట్టుగా అనిపించింది. ఆయన వర్కింగ్ స్టైల్ చూస్తుంటే నాకు 'బాపు'గారే గుర్తుకు వచ్చారు. ఇక నేను కీరవాణిగారి సంగీతానికి అభిమానిని. ఆయన సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో చేయడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించే విషయం.
ఈ సినిమా కోసం మేమంతా 45 రోజుల పాటు ఒక చోట ఉండటం వలన, ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా కలిసిపోయాము. చివరిగా నేను చెప్పవలసిన ఒక వ్యక్తి ఉన్నాడు .. ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసు. అతను 'ఉప్పెన'లో నా కొడుకు .. 'కొండ పొలం'లో నా కొడుకు. అతని మంచితనం .. అతనితో ఉన్న అనుబంధం గురించి, ఆయన కమిట్మెంట్ గురించి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడతాను. అందుకోసం ఆ విషయాలను అట్టిపెట్టుకున్నాను అంటూ వైష్ణవ్ తేజ్ ను హత్తుకున్నాడు. "దానమ్మా .. పుడితే కర్నాల్లో బుట్టలా .. చూస్తే 'కొండ పొలం' సినిమా జూడాలా" అంటూ కర్నూల్ యాసలో చాలా హుషారుగా సందడి చేశారు.