Begin typing your search above and press return to search.
మీడియా అటెన్షన్ కోసమా పబ్లిక్ కిస్సింగ్
By: Tupaki Desk | 14 Dec 2022 3:14 PM GMTకరీనా కపూర్- సైఫ్ అలీ ఖాన్ జంట అన్యోన్యత ఆహ్లాదకరమైన ఫ్యామిలీ లైఫ్ అభిమానులకు ఎల్లపుడూ స్ఫూర్తి. దశాబ్దానికి పైగా సంతోషకర వైవాహిక జీవితాన్ని లీడ్ చేసిన ఈ జంట నిరంతరం ఒకరిపై ఒకరు తమ ప్రేమాభిమానాలను కురిపించే తీరుపై ఫ్యాన్స్ స్ఫూర్తిగా తీసుకుంటారు.
ప్రేమను వ్యక్తం చేయడంలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. ఈ జంట కూడా తమదైన శైలిని ప్రతిసారీ పబ్లిక్ లో ఆవిష్కరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు సైఫ్- కరీనా జంట తమ స్వగృహం (ఇంటి) ముందు పబ్లిగ్గా ఒక లిప్ లాక్ వేయడం ఇప్పుడు కెమెరా కంటికి చిక్కింది. కరీనా ఒక అందమైన ఒక తీపి ముద్దుతో సైఫ్ కు వీడ్కోలు పలికింది.
ఆ సమయంలో తైమూర్ అలీఖాన్ ఈ జంటతోనే ఉన్నాడు. తైమూర్ ని సైఫ్ ఖాన్ తన భుజాలపై వేసుకుని నడుచుకుంటూ వెళుతున్న దృశ్యం అభిమానుల కంట పడింది. ఓవైపు చిన్నారి తైమూర్ చాలా అల్లరి చేస్తూ కనిపించాడు. భార్యకు వీడ్కోలు పలికిన తర్వాత సైఫ్ తైమూర్ ని ఇంటికి తీసుకువెళుతున్న ఈ దృశ్యం సోషల్ మీడియాల్లో వైరల్ గా మారింది. చిన్నారి టిమ్ టిమ్ తన తండ్రి భుజానికి తలక్రిందులుగా వేలాడుతూ డాడీ జీన్స్ జేబులో నుండి ఫోన్ ను దొంగిలించాడు. అయితే పబ్లిక్ లో ఇలా లిప్ లాక్ లాగడంపై సోషల్ మీడియాల్లో రకరకాల కామెంట్లు పడిపోతున్నాయ్. ఈ జంట మీడియా అటెన్షన్ కోసమే ఇలా చేసిందా? అంటూ ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు.
ఇటీవలి కాలంలో సైఫ్ కెరీర్ పరంగా బిజీగా ఉన్నా కరీనా ఇంటి వ్యవహారాల్లో తలమునకలుగా ఉంది. తన రెండో కుమారుడిని స్వాగతించాక మామ్ గా బాధ్యతలు మరింత పెరిగాయి. కరీనా తన అనుకూలతను బట్టి మాత్రమే అడపా దడపా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.
ఇక కరీనా - సైఫ్ జంట మరొక కుమారుడు జహంగీర్ (జెహ్ ముద్దు పేరు) కు తల్లిదండ్రులు. ఓ ఇంటర్వ్యూలో జెహ్ తన తల్లి కరీనాను అంటిపెట్టుకుని ఉంటాడని .. జెహ్ కు మాటలు వచ్చే క్రమంలో తనకు చేరువవుతాడని కూడా సైఫ్ తెలిపారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. సైఫ్ తదుపరి `ఆదిపురుష్ 3డి`లో ప్రభాస్ -కృతి సనన్ లతో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదల కానుంది. ఇదే గాక.. సైఫ్ బాలీవుడ్ లో భారీ ప్రాజెక్టులకు కమిటవుతున్నాడని సమాచారం. మరోవైపు కరీనా ఫిలింమేకర్ హన్సల్ మెహతా తదుపరి చిత్రంలో నటించనుంది. జైదీప్ అహ్లావత్ -విజయ్ వర్మతో కలిసి నటించిన `ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్`తో బెబో త్వరలో డిజిటల్ ఆరంగేట్రం చేయనుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.