Begin typing your search above and press return to search.

ఇంట్లో ఉంటే ఎక్కువమంది పిల్లలు పుట్టేలా ఉన్నారట

By:  Tupaki Desk   |   13 Nov 2021 5:20 AM GMT
ఇంట్లో ఉంటే ఎక్కువమంది పిల్లలు పుట్టేలా ఉన్నారట
X
సరదాగా చెప్పిన బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన సైఫ్ అలీ ఖాన్ మాటలు ఇప్పుడు అందరిని ఆకర్షించేలా ఉన్నాయి. లేటు వయసులోనూ రెండో పెళ్లి చేసుకున్న ఆయన.. పిల్లల్ని వరుసగా కంటున్నారు. తాజాగా ఆయన నటించిన బంటీ ఔర్ బబ్లీ 2 చిత్రానికి సంబంధించిన సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంటున్నారు. ఇందులో భాగంగా ఫేమస్ అయిన కపిల్ శర్మ షోకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగానే కాదు.. అందరూ మాట్లాడుకునేలా చేశాయి. వరుస పెట్టి సినిమాలు చేస్తున్న సైఫ్ ను ఉద్దేశించి కపిల్ శర్మ.. ఇలా వరుస పెట్టి సినిమాలు చేయటం ఏమిటి? మీకు పని అంటే ప్రేమా? లేదంటే రెండో కొడుకు పుట్టాక కుటుంబం కోసం ఎక్కువ పని చేయాల్సి వస్తోందా? అంటూ తనకున్న సందేహాన్ని సంధించారు.

దీనికి ఊహించని రీతిలో బదులిచ్చారు సైఫ్ అలీ ఖాన్. ఇంట్లోఉంటే ఇంకా ఎక్కువ మంది పిల్లలు పుట్టేలా ఉన్నారని..ఆ భయంతోనే ఇలా సినిమాలతో బిజీగా ఉన్నానని చెప్పారు. ఫన్నీగా చెప్పిన సైఫ్ మాటలకు కపిల్ శర్మతో పాటు.. షోకు హాజరైన వారంతా పెద్ద ఎత్తున నవ్వేశారు. అయినా.. ఇంట్లో ఎక్కువమంది ఉంటే ఎందుకుపిల్లలు పుడతారు? ఇద్దరు పిల్లల తర్వాత కూడా ఆపరేషన్ ఎందుకు చేయించరు? లాంటి సీరియస్ క్వశ్చన్లు సోషల్ మీడియాలోచర్చకు వస్తే.. సైఫ్ మాటలు ఆయన్ను ఇబ్బందుల్లో పడేసే ప్రమాదం ఉంది సుమా.