Begin typing your search above and press return to search.
ప్రభాస్ ని ఇంతగా పొగిడేసిన వేరొక హీరో లేడు!
By: Tupaki Desk | 9 Oct 2021 6:31 AM GMTడార్లింగ్ ప్రభాస్ బాహుబలిగా వీరరసాన్ని అద్భుతంగా పండించిన సంగతి తెలిసిందే. రాకుమారుడిగా.. రాజాధిరాజుగా ప్రభాస్ ట్రాన్స్ ఫర్మేషన్ యాక్షన్ సన్నివేశాల్లో విరోచితమైన పోరాట దృక్పథం అతడిలో కనిపించింది.
ఇప్పుడు శ్రీరాముడిగా అతడు పూర్తి భిన్నంగా కనిపించాల్సి ఉంటుంది. ఓంరౌత్- ఆదిపురుష్ 3డిలో అతడు ఎలా కనిపిస్తాడు? అన్నదానికి ఇందులో రావణుడిగా నటిస్తున్న సైఫ్ అలీఖాన్ వివరణ ఇచ్చారు. ప్రభాస్ ఈ చిత్రంలో ఎంతో వైవిధ్యంగా కనిపిస్తాడని కితాబిచ్చారు. అంతేకాదు లంకేషుడి పాత్ర చిత్రణ పూర్తయిందని కూడా సైఫ్ వెల్లడించారు.
ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో సైఫ్ అలీ ఖాన్ ఇంతటి భారీ చిత్రంలో భాగం కావడం గురించి సుదీర్ఘంగా మాట్లాడారు. ప్రభాస్ తో పనిచేయడాన్ని కూడా ప్రశంసించారు. సైఫ్ అలీ ఖాన్ మొదటిసారిగా పౌరాణిక కాన్సెప్ట్ ఉన్న చిత్రంలో నటిస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలని పిచ్చిగా వేచి చూస్తున్నారట. ``నా ఉద్దేశ్యం మొదటగా.. ఇంత గొప్ప చిత్రంలో భాగం కావడం ఆనందాన్నిస్తోంది. రామాయణంలో విలన్ రావణుడిగా నాకు అవకాశం రావడం సంతోషాన్నిచ్చింది. రెండవది ప్రభాస్ తో పని చేయడం చాలా బాగుంది. అతనితో కలిసి మెలిసి పని చేయడం సూపర్భ్. నేను అతనిని దగ్గరగా చూస్తూనే ఉన్నాను. అతడు బాహుబలి లాగా కనిపిస్తాడు. రాముడిగా మారినప్పుడు విభిన్నంగా కనిపిస్తాడు. అతనితో పని చేయడం చాలా గొప్పగా ఉంటుంది. అతను చాలా ఉల్లాసంగా జాయ్ ఫుల్ గా ఉండే నటుడు. హింసాత్మక .. యాక్షన్ సీక్వెన్స్ లు చేస్తున్నప్పుడు మాలో మేం ఒక్కోసారి నవ్వుకుంటాం. కాబట్టి మానసికంగా ఇంతగా కలిసి మెలిసి పని చేయడం ఎల్లప్పుడూ పెద్ద బలం. ప్రభాస్ పూర్తిగా జెంటిల్ మన్. చాలా మంచి వ్యక్తి...`` అంటూ ప్రశంసలు కురిపించారు.
రామాయణంలో కొన్ని పాపులర్ సన్నివేశాలను ఇటీవల చిత్రీకరిస్తున్నారు. ఇది ఇప్పటికే మిలియన్ల మంది వీక్షించిన పురాణేతిహాస కథ. భారతీయ సాహిత్యంలో కూడా చాలా పాపులర్. కాబట్టి ఆ సన్నివేశాలను ప్రదర్శించే అవకాశం పొందడం నా లక్. మేము లుక్ కోసం చాలా కష్టపడ్డాం. దర్శకుడు ఓంరౌత్ ఈ చిత్రాన్ని ఒక విజువల్ వండర్ గా తీర్చిదిద్దుతున్నారు. సినిమాలో కొన్ని సన్నివేశాలు మన స్క్రీన్ లపై ఎన్నడూ చూడనివిగా ఉంటాయి. ఇది నిజమైన గౌరవం. ఇంత గొప్ప ప్రాజెక్ట్ లో భాగం అవ్వడం ఆనందాన్నిస్తోంది. ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను... అని తెలిపారు.
ప్రతి 40 సంవత్సరాలకు ఒకసారి రామాయణం సినిమా చేసినా.. ప్రతిసారీ ఇది భిన్నమైనదిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ విషయంలో ఖచ్చితంగా ఉన్నాను. భారతీయ పురాణేతిహాసంలో భాగం అయినందుకు నేను నిజంగా సంతోషిస్తున్నాను. అది కూడా.. రావణుడిగా గొప్ప పాత్రను పోషించే అవకాశం దక్కడం అదృష్టం.. అని అన్నారు.
సైఫ్ విలన్ గా నటించడం ఇదే మొదటిసారి కాదు. అతను ఓంకారా- తనాజీ 3డి - ఏక్ హసినా థి వంటి చిత్రాలలో విలన్ గా తన నటనకు ప్రశంసలు అందుకున్నాడు. ఒక్కోసారి విలన్ గా నటించడం సరదాగా ఉంటుంది. కానీ ప్రస్తుతానికి నేను అలాంటి పాత్రలు పోషించాలనుకోవడం లేదు. ఇంకేదైనా నటించాలనుకుంటున్నాను. విలనీ కొంత ప్రతికూలంగా ఉంటుంది. చాలా అలసిపోతున్నాను.. అని అన్నారు.
ఆదిపురుష్ రిలీజ్ తేదీ ఫిక్స్
ఇటీవల ఆదిపురుష్ రిలీజ్ తేదీని చిత్రనిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం 11 ఆగష్టు 2022 న వెండితెరపైకి వస్తుంది. ఇటీవల బాలీవుడ్ స్టార్ల చిత్రాల విడుదల తేదీలు ప్రకటించిన క్రమంలోనే ఆదిపురుష్ తేదీని లాక్ చేశారు. 2021 మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ `ఆదిపురుష్ 3డి` ప్రకటన వెలువడడం ప్రభాస్ అభిమానుల్లో ఆనందం నింపింది.
ఈ చిత్రంలో ప్రభాస్- కృతి సనన్- సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇది ప్రకటించినప్పటి నుండి అత్యంత చర్చనీయాంశమైన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ పురాణ గాథ రామాయణంపై ఆధారపడి తెరకెక్కిస్తున్నారు. సైఫ్ రావణుడి పాత్రలో నటిస్తుండగా.. కృతి సీతగా కనిపించనుంది. ఈ చిత్రానికి ఓం రౌత్- భూషణ్ కుమార్- క్రిషన్ కుమార్ నిర్మిస్తున్నారు.