Begin typing your search above and press return to search.

మళ్లీ మాటలతోనే కొట్టేసిందిగా

By:  Tupaki Desk   |   16 Feb 2017 12:56 PM GMT
మళ్లీ మాటలతోనే కొట్టేసిందిగా
X
బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ కు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వెన్నతో పెట్టిన విద్య. ఎవరి మీదైనా.. ఎలాంటివారి మీదైనా తనకు నచ్చినట్లు వ్యాఖ్యలు చేసేయగలదు. ఈమె ఎవరినైనా టార్గెట్ చేసిందంటే.. వరుసగా ఏదో ఒకటి చెబుతూనే ఉంది. ప్రస్తుతం ఈమె రంగూన్ అనే మూవీలో నటించగా.. ఈ మూవీలో నటించిన షాహిద్ కపూర్ కి.. ఈ క్వీన్ కు పడడం లేదనే టాక్ ముందునుంచి ఉంది.

షాహిద్ కపూర్ చీమిడి ముక్కుకు ముద్దు పెట్టడం కష్టం.. లాంటి కామెంట్స్ చాలానే చేసింది కంగనా. షాహిద్ కూటా ఈమెపై కౌంటర్లు వేశాడు కానీ.. అవేమీ అంత పవర్ ఫుల్ గా లేవు. ఇప్పటికే రెండు సార్లు డైరెక్టుగానే ఎటాక్ చేసిన క్వీన్.. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఇన్ డైరెక్టుగా షాహిద్ కి పంచ్ వేసింది. 'సైఫ్ అలీ ఖాన్ చాలా ఫన్నీ. మనం ఎప్పుడూ కంఫర్టబుల్ గా ఉండాలని కోరుకుంటాడు. అతనితో వర్క్ చేయడం చాలా సులభం. కానీ షాహిద్ అలా చాలా కాంపిటీటివ్. ముందస్తుగా చాలా రిహర్సల్ చేస్తాడు' అని చెప్పింది కంగనా రనౌత్.

ఈ కామెంట్స్ సైఫ్ ను పొగడుతున్నట్లు అనిపిస్తున్నా.. అసలు ఉద్దేశ్యం మాత్రం షాహిద్ ను తెగడ్డమే అనే సంగతి తెలిసిపోతోంది. మరి కంగనా కౌంటర్ కు.. షాహిద్ ఈసారైనా సరైన ఎన్ కౌంటర్ ఇస్తాడో ఇవ్వడో!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/