Begin typing your search above and press return to search.
ప్రమోషన్ కోసం ఎమోషన్ అవుతున్న సైఫ్!
By: Tupaki Desk | 28 Aug 2015 3:59 PM GMTసినిమా అన్నాక దానికి ప్రమోషన్ తప్పదు! ఎందుకంటే, ఎంత బాగా ప్రమోట్ చేసుకుంటే... అంత మొత్తంలో కలెక్షన్లు వస్తాయి. అయితే, ఈ ప్రమోషన్ కి కాస్త ఎమోషన్ యాడ్ చేస్తే ప్రజలు ఈజీగా కనెక్ట్ అయిపోతారన్న సూత్రాన్ని బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ బాగా వంటపట్టించుకున్నట్టున్నాడు. అందుకే, ఇవాళ్ల (శుక్రవారం) విడుదలైన ‘పాంటమ్’ చిత్ర ప్రమోషన్ ను బాగానే చేస్తున్నాడు. ఈ సినిమా కథాంశం అంతా పాకిస్థాన్ లోని ఉగ్రవాదుల చుట్టూ తిరుగుతుంది. ముంబై దాడుల వెనకున్న కీలక సూత్రదారిని అంతమొందించే పోలీసు పాత్రలో సైఫ్ నటించాడు. ఈ కథాంశం కాంట్రోవర్సియల్ గా ఉందని చిత్రాన్ని పాక్ బ్యాన్ చేసింది. ఆ విషయం తెలిసిన వేంటనే ఒక్కక్షణం కూడా ఆలస్యం చేయకుండా ప్రెస్ మీట్ పెట్టేశాడు సైఫ్. మామూలుగా అయితే పాక్ వైఖరిని ఖండిస్తూ సైఫ్ మట్లాడేమో అని అనుకుంటాం. కానీ, అంతకుమించిన సంచలన వ్యాఖ్యలు సైఫ్ చేయడం విశేషం.
ముంబై టెర్రర్ వెనకున్న అసలు వ్యక్తి హఫీజ్ సయ్యద్ అని చెప్పాడు సైఫ్. సయ్యద్... జమాత్ ఉద్ దవా ఛీప్. ఈ మాట సైఫ్ చెప్పేసరికి మీడియా అంతా షాక్ తింది. అంతేకాదు, మూడేళ్ల కిందట ఐ.ఎస్.ఐ. ఛీప్ గా బాధ్యతలు నిర్వర్తించిన అలీఖాన్ తనకి బంధువు అవుతారని సైఫ్ అన్నాడు. తన బాల్యంలో వారి పిల్లల్తో ఆడుకున్నానని చెప్పాడు. ఇప్పుడు పాక్ ఇంటర్నేషనల్ ఎఫైర్స్ సెక్రటరీ షెర్యార్ ఖాన్ కూడా తనకి వరసకి బంధువు అవుతారని సైఫ్ చెప్పడం ఇంకో విశేషం.
సైఫ్ కెరీర్‌కి ఈ సినిమా ఎంతో కీలకం. ఇది కచ్చితంగా ఆడి తీరాలి. ఎందుకంటే, గడచిన కొన్నేళ్లుగా అతడి సక్సెస్ ట్రాక్ సరిగా లేదు. కాబట్టి, ఈ చిత్రాన్ని వీలైనంత బాగా ప్రమోట్ చేయాలని సైఫ్ డిసైడ్ అయినట్టున్నాడు. అందుకే, ఇలాంటి కామెంట్లు చేస్తూ... సినిమాను ఎలాగైనా వార్త హెడ్ లైన్స్ నుంచి కిందకి దిగకుండా ఉంచేందుకు తాపత్రయ పడుతున్నట్టున్నాడు.