Begin typing your search above and press return to search.
'రావణుడు' లుక్కులో దర్శనమిచ్చిన స్టార్ యాక్టర్!
By: Tupaki Desk | 18 March 2021 7:30 AM GMTబాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్.. కరీనాకపూర్ ఫిబ్రవరిలో తమ రెండవ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా సైఫ్ నెలరోజుల పాటు సినిమా షూటింగ్ లకు దూరంగా ఉన్నాడు. అయితే ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆదిపురుష్ సినిమాలో సైఫ్ రావణుడి పాత్ర పోషిస్తున్న విషయం విదితమే. ప్రభాస్ రాముడుగా కనిపించనుండగా.. కృతిసనన్ సీత పాత్రలో నటించనుంది. నెల తర్వాత సైఫ్ ఆదిపురుష్ సినిమా షూటింగ్ ప్రారంభించాడు. అయితే ఈసారి సైఫ్ లుక్ అందరికి ఆశ్చర్యంతో పాటు ఆనందం కలిగించిందని చెప్పాలి. సైఫ్ తాజాగా న్యూ హెయిర్ కట్ తో పాటు కాంటాక్ట్ బ్లూ లెన్సెస్ ధరించి కనిపించాడు. ఈ విధంగా రావణ్ క్యారెక్టర్ లుక్ ఇలాగే ఉండబోతుందని అర్ధమవుతుంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో సైఫ్ న్యూ లుక్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కానీ సైఫ్ మాస్క్ ధరించి ఉండడం మనం చూడవచ్చు. అయితే ఆదిపురుష్ సినిమాను తానాజీ ఫేమ్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్నాడు. చెడు పై మంచి సాధించిన విజయం అనే కాప్షన్ తో రూపొందుతున్న ఈ సినిమా పై ప్రేక్షకులలో అంచనాలు ఓ రేంజిలో సెట్ అయ్యాయి. అలాగే ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ఇటీవలే ప్రకటించింది చిత్రబృందం. వచ్చే ఏడాది అంటే 2022 ఆగష్టు 11న ఆదిపురుష్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో రాముడి సోదరుడు లక్ష్మణుడుగా సన్నీ సింగ్ నటిస్తున్నాడు. అయితే సారా అలీఖాన్, ఇబ్రహీం అలీఖాన్, తైమూర్ తర్వాత ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చారు సైఫ్ దంపతులు. ఖచ్చితంగా బిడ్డ పుట్టినప్పుడు సెలవులు తీసుకుంటానని ముందే చెప్పి తీసుకున్నాడట. అయితే ప్రస్తుతం సైఫ్ కూతురు సారా అలీఖాన్ బాలీవుడ్ హీరోయిన్ గా బిజీ అవుతోంది.