Begin typing your search above and press return to search.

సారా పై హాట్ కామెంట్స్.. సైఫ్ హ్యాపీ!

By:  Tupaki Desk   |   4 Oct 2016 4:12 AM GMT
సారా పై హాట్ కామెంట్స్.. సైఫ్ హ్యాపీ!
X
గతంలో హీరోల కొడుకులు హీరోలు అవ్వడం ఎంత కామనో... ఈ మధ్యకాలంలో స్టార్ల కూతుర్లు కూడా హీరోయిన్స్ అవ్వడం అంత కామన్ గా మారిపోయింది. ఈ విషయంలో మిగిలి ఇండస్ట్రీల కంటే బాలీవుడ్ ముందుంది. అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురి బాలీవుడ్ ఎంట్రీపై కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. సైఫ్ కూతురు సారా త్వరలో సినిమాల్లోకి వస్తుందని - అందుకే హాట్ హాట్ గా తయారయ్యి దర్శనమిస్తుందని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ కామెంట్స్ పై సైఫ్ కూడా స్పందించాడట!

కుటుంబం నేపథ్యం - పెరిగిన ప్రపంచం అంతా సినిమానే కావడంతో సైఫ్ కూతురు సారా ఖాన్ కూడా ఇటు వైపే అడుగులు వేస్తుందని వార్తలొస్తున్నాయి. అయితే తాజాగా కరీనా కపూర్ బర్త్ డే రోజున సారా సెంట్రాఫ్ అట్రాక్షన్ కావడం, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో... తన కూతురు త్వరలో సినిమాల్లోకి రావడంపై పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తుందని సైఫ్ భావిస్తున్నాడట. సినిమాల్లోకి రాబోయే తన కూతురి గురించి... "చాలా అందంగా ఉంది.. హాట్ గానూ ఉంది.. బాలీవుడ్ హీరోయిన్ గా రాణించే అవకాశమూ ఉంది.. అని అభిమానుల నుంచీ, మీడియా నుంచీ కామెంట్స్ వస్తుండటంతో సైఫ్ చాలా హ్యాపీగానూ - సంతృప్తిగానూ ఉన్నాడని బీటౌన్ సమాచారం.

అయితే... సారా సినిమాల్లోకి రావడంపై సైఫ్ ఇప్పటికే సుముఖత వ్యక్తం చేశాడని టాక్. సైఫ్ ఆల్రెడీ సినిమా కుటుంబం నుండి వచ్చినవాడే కావడం ఇదే సమయంలో సైఫ్ మొదటి భార్య, సారా తల్లి అమృత సింగ్ కూడా హీరోయినే అవ్వడంతో సారాకు పెద్దగా ఆటంకాలు ఉండకపోవచ్చు. ఇదే సమయంలో సైఫ్ రెండో భార్య కరీనా కూడా స్టార్ హీరోయిన్.. అలాగే సైఫ్ తల్లి షర్మిలా ఠాకూర్ నిన్నటితరం బాలీవుడ్ హీరోయిన్ కాగా, అతడి సోదరి సోహా అలీ ఖాన్ కూడా ప్రస్తుతం బాలీవుడ్ లో హీరోయిన్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈస్థాయిలో ఫ్యామిలీ మొత్తం సినిమాల్లో ఉండటంతో... సారా రాకకు అడ్డంకులేమీ ఉండవనేది అభిమానుల అంచనాగా ఉంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/