Begin typing your search above and press return to search.

ఈ సైఫ్‌ ఫ్యాన్స్ గోలేంది గురూ!!

By:  Tupaki Desk   |   1 March 2017 12:30 AM GMT
ఈ సైఫ్‌ ఫ్యాన్స్ గోలేంది గురూ!!
X
ఒక సినిమా హిట్టయితే మాత్రం క్రెడిట్ హీరో ఖాతాకే వస్తుంది. ఫ్లాపైందా.. ఇక డైరక్టర్ ను బండ బూతులు తిడుతుంటారు. సాధారణంగా చాలామంది ఫ్యాన్స్ ఇదే తరహాలో బిహేవ్ చేస్తుంటారు. ముఖ్యంగా బాలీవుడ్ లో అయితే హిట్టు క్రెడిట్ అంతా హీరో ఖాతాలో వేయడం ఒక ఆనవాయితీ.

ఇప్పుడు ''రంగూన్'' సినిమాలో దేశం మీద భక్తికి సంబంధించి ఎంత మంచి కంటెంట్ చూపించినా కూడా.. దంగల్ సినిమా తరహాలో ఓవర్ డ్రామా చేయకపోడం.. ఏడుపు సీన్లలో మెలోడ్రామా సృష్టించకపోవడంతో.. ఈ సినిమా ఫ్లాపై పోయింది. దానికి తోడు సినిమా చివర్లో కంగన అండ్ షాహిద్ కపూర్ ను చచ్చిపోవడం.. అలాగే సినిమాలో వీరి మధ్యన సెక్స్ సీన్ ఉంది కాని నిజమైన లవ్ స్టోరీని సరిగ్గా ఎస్టాబ్లిష్‌ చేయకపోవడంతో వారి అభిమానులకు కూడా నచ్చలేదు. ఇదంతా ఒకెత్తయితే.. ఇప్పుడు సైఫీన్ ఫ్యాన్స్ (సైఫ్‌ అండ్ కరీనా ఫ్యాన్స్).. మా సైఫ్‌ సార్ 20 నిమిషాలు పాటు గెస్ట్ రోల్ చేసినా కూడా.. తను కూడా హీరోరోల్ చేసినట్లు ప్రమోట్ చేశారు. అయినాసరే కంగనా అండ్ షాహిద్ ఎక్సట్రాల వలన సినిమా ఫ్లాపైంది.. అంటూ నెట్లో తెగ రెచ్చిపోతున్నారు. పైగా దర్శకుడు విశాల్ భరద్వాజ్.. కంగన.. షాహిద్ లను.. బ్లెడీ హెల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాలో బ్లడీ హెల్ అనేద ఒక హిట్ సాంగ్.. అలాగే హీరోయిన్ ఊతపదం కూడా. ఇక ట్విట్టర్లో అఫీషియల్ ఫ్యాన్ ఎకౌంట్ల నుండి ఇలాంటి ట్వీట్లు వేయడం బాధాకరం.

ఆ మాటకొస్తే సైఫ్‌ ఆలీ ఖాన్ ఈ మధ్య కాలంలో సోలోగా చేసిన ఎన్ని సినిమాలు ఆడేశాయేంటి? 2013లో వచ్చిన రేస్ 2 తరువాత.. ఇప్పటివరకు అసలు హిట్టే లేదు. గో గోవా గాన్.. బుల్లెట్ రాజా.. హమ్ షకల్స్.. హ్యాపీ ఎండింగ్.. ఫ్యాంటమ్.. ఇలా అన్నీ డిజాష్టర్లేనయ్యా. అలాంటప్పుడు షాహిద్ అండ్ కంగనాలను ఫ్లాపు స్టార్లు అంటూ కామెంట్ చేయడం ఎందుకు బాస్?