Begin typing your search above and press return to search.

కొడుకు కంబ్యాక్ పై తండ్రి ఆత్రం!

By:  Tupaki Desk   |   4 July 2019 7:22 AM GMT
కొడుకు కంబ్యాక్ పై తండ్రి ఆత్రం!
X
పుత్రోత్సాహ‌ము సుపుత్రుని క‌నంగా..! వార‌సుని స‌క్సెస్ ఏ తండ్రికైనా బోన‌స్ లాంటిది. కొడుకు హీరో అవ్వ‌డం అన్న‌దే ఎగ్జ‌యిటింగ్ మూవ్ మెంట్ అనుకుంటే స‌క్సెస్ అద‌న‌పు ఆనందాన్నిస్తుంది. అయితే వార‌స హీరోలు దానిని నిల‌బెట్ట‌డం అనేది ఎంతో బ‌రువు బాధ్య‌త‌తో కూడుకున్న‌ది. నెప్టోయిజం(వార‌స‌త్వం).. లెగ‌సీ అంటూ విమ‌ర్శ‌లతో ఉక్కిరి బిక్కిరి చేసే చోట స్టార్ డ‌మ్ నిల‌బెట్టుకోవ‌డం అంత ఆషామాషీ కానే కాదు. అయితే ఇలాంటి చోట‌ ఆది సాయికుమార్ ఏ మెట్టుపై ఉన్న‌ట్టు? అంటే .. ఆరంభం `ప్రేమ కావాలి`తో యావ‌రేజ్ అనిపించాడు. `ల‌వ్ లీ` చిత్రంతో హిట్టు కొట్టాడు. ఆ త‌ర్వాత `గాలిప‌టం` అనే సినిమా క‌మ‌ర్షియ‌ల్ గా ఫ‌ర్వాలేద‌నిపించింది. కానీ ఇత‌ర‌త్రా సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వ‌ద్ద తేలిపోయాయి. ఆది కెరీర్ ప‌రంగా చిన్న‌పాటి స్ట్ర‌గుల్ ఎదుర్కొంటున్నాడు. అందుకే కొడుకు స‌క్సెస్ కోసం సాయికుమార్ ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.

ఆది న‌టించిన తాజా సినిమా `బుర్ర‌క‌థ‌` ఈ శుక్ర‌వారం(జూలై 5) రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా పాత్రికేయ స‌మావేశంలో ఆది తండ్రి గారైన‌ సాయికుమార్ మాట్లాడుతూ.. ఈసారి ఆది హిట్టు కొట్టి తీర‌తాడ‌ని న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు. డైలాగ్ కింగ్ సాయికుమార్ మాట్లాడుతూ ``ఆ రోజుల్లో ఏదైనా మంచి పాత్ర వ‌స్తే ఉద్వేగానికి గురై నేను మా నాన్న‌కు చెప్పేవాడిని. అలాగే మా అబ్బాయి కూడా `బుర్ర‌క‌థ‌` విష‌యంలో చాలా సార్లు ఎగ్జ‌యిట్ అయి మా ఇంటికి వ‌చ్చి నాతో షేర్ చేసుకునేవాడు. ల‌వ్లీ.. శ‌మంత‌క‌మ‌ణి త‌ర్వాత ఆది- రాజేంద్ర‌ప్ర‌సాద్ కాంబినేష‌న్ హ్యాట్రిక్ షురూ`` అని అన్నారు.

స‌క్సెస్ ఫెయిల్యూర్ గురించి ప్ర‌స్థావిస్తూ.. ``గెలుపోట‌ములు అనేవి ఈ ఇండ‌స్ట్రీలో స‌ర్వ‌సాధార‌ణం. ఆడ‌వు అనుకున్నవెన్నో ఆడి చూపించాయి. శంక‌రాభ‌ర‌ణం- పోలీస్ స్టోరీ- సేతు ఆ త‌ర‌హానే. బుర్ర‌క‌థ చిత్రంతో ఆది పెద్ద విజ‌యం అందుకుంటాడు. అంద‌రూ థియేట‌ర్ల‌లో చూసి ఆనందించండి`` అన్నారు. ఇదే వేదిక‌పై ఆది మాట్లాడుతూ ``సినిమా చాలా బాగా వ‌చ్చింది. చాలాసార్లు ఆ మాట‌ న‌మ్మ‌కంగానే చెప్పాను. రాజేంద్ర‌ప్ర‌సాద్‌గారితో సినిమా అన‌గానే ఇందులో నా పాత్ర గురించి విన్నాక వారం రోజులు స‌రిగా నిద్ర‌ప‌ట్ట‌లేదు. అంత ఎగ్జ‌యిటింగ్ గా చేసిన చిత్ర‌మిది`` అన్నారు.