Begin typing your search above and press return to search.

వీకెండ్ ని వాడేసుకున్న అల్లుడు

By:  Tupaki Desk   |   17 Sep 2018 8:23 AM GMT
వీకెండ్ ని వాడేసుకున్న అల్లుడు
X
నాగ చైతన్య హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందిన శైలజారెడ్డి అల్లుడు వీక్ ఎండ్ ని బాగా వాడేసుకున్నాడు. టాక్ తో పాటు రివ్యూలు బాగా డివైడ్ గా వచ్చిన నేపధ్యంలో వాటి తాలూకు ప్రభావం మూడో రోజు ఉన్నప్పటికి సెలవు రోజు అందులోనూ ఆదివారం ఇంకే చెప్పుకోదగ్గ సినిమా పోటీగా లేకపోవడం ప్లస్ గా మారింది. యుటర్న్ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్నప్పటికీ అది అన్ని వర్గాలకు చేరే మూవీ కాకపోవడంతో థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు మాత్రమే వెళ్తున్నారు. శైలజారెడ్డి ఈ అవకాశాన్ని బాగా తీసుకుంది. రిలీజైన మొదటి వీక్ ఎండ్ వసూళ్లను బట్టి హిట్టా కాదా అని డిసైడ్ చేయలేం కానీ చైతు మార్కెట్ కి ఇవి చాలా మంచి కలెక్షన్స్ అని చెప్పొచ్చు. ఇప్పటి దాకా 14.50 కోట్ల దాకా షేర్ రాబట్టిన చైతు మరో పదికి పైగా ఇస్తేనే హిట్ అనిపించుకుంటాడు. 24 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ జరిగిన నేపధ్యంలో అంత మొత్తం షేర్ గా వస్తేనే నష్టాలు రానట్టు. ఇక ఏరియాల వారీగా 4 రోజుల షేర్లు ఈ విధంగా ఉన్నాయి

నైజామ్ - 3. 67 కోట్లు

సీడెడ్ - 2.09 కోట్లు

ఉత్తరాంధ్ర - 1.35 కోట్లు

గుంటూరు - 1.13 కోట్లు

ఈస్ట్ గోదావరి - 1.30 కోట్లు

వెస్ట్ గోదావరి - 0.78 కోట్లు

కృష్ణా - 0.84 కోట్లు

నెల్లూరు - 0.49 కోట్లు

తెలుగు రాష్ట్రాల 4 రోజుల షేర్ - 11.65 కోట్లు

రెస్ట్ అఫ్ ఇండియా - 1.63 కోట్లు

ఓవర్సీస్ - 1.45 కోట్లు

ప్రపంచవ్యాప్త షేర్ 4 రోజులకు - 14.73 కోట్లు

ఇదే జోరు ఈ రోజు నుంచి కూడా వీక్ డేస్ లో కొనసాగిస్తేనే అల్లుడు సేఫ్ అవుతాడు. పండగ సెలవుతో కలుపుకుని నాలుగు రోజుల పెద్దవారాంతాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న అల్లుడు ఇప్పుడు కూడా స్టడీగా కలెక్షన్స్ రాబడితే ఏ సమస్యా లేదు. కానీ డ్రాప్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. అది ఎంత శాతంలో ఉంటుంది అనేది చూడాలి. ఈ శుక్రవారం సుధీర్ బాబు నన్ను దోచుకుందువటే - అర్జున్ కురుక్షేత్రం - విక్రమ్ స్వామి స్క్వేర్ లు బరిలో దూకుతున్నాయి. ఇందులో అర్జున్ సినిమా తప్పించి మిగిలినవాటికి బాగానే హైప్ ఉంది. ప్రేక్షకులు వాటిని పాస్ చేసారా శైలజారెడ్డి అల్లుడు మీద కొంత ప్రభావం ఉండే ఉంటుంది. సో ఇంకా పది కోట్ల టార్గెట్ ను చైతు ఎలా ఛేదిస్తాడో చూడాలి.