Begin typing your search above and press return to search.
బిగ్ ఫైట్: శౌర్య వర్సెస్ శైలజ
By: Tupaki Desk | 18 Aug 2018 4:44 AM GMTవారం వారం రెండు మూడు సినిమాలు ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయి. వీటిలో ఏ సినిమాలో దమ్ముంటే ఆ సినిమాకి ప్రేక్షకజనం బ్రహ్మరథం పడుతున్నారు. రీసెంట్ సినిమాల్లో గూఢచారి - గీతగోవిందం బ్లాక్ బస్టర్లుగా నిలిస్తే - శ్రీనివాస కళ్యాణం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇలా ప్రతి వారం సినిమాలొస్తూనే ఉంటాయి. పోతూనే ఉంటాయి. వీటిలో విజయాలతో నిర్మాతలు - పంపిణీదారులకు ఆనందాన్ని మిగిల్చేవి కొన్ని మాత్రమే మిగులుతున్నాయి. ప్రతియేటా టాలీవుడ్ లో 150-200 సినిమాలు రిలీజవుతుంటే .. 5శాతం మాత్రమే సక్సెస్ రేటు ఉండేది. కానీ గత ఏడాది అది 8-10 శాతానికి పెరగడం ఊహించని పరిణామం. మన దర్శకనిర్మాతల ఆలోచనల్లో కంటెంట్ పెరిగిందని ఆ రిజల్ట్ చెప్పింది.
అది సరే.. ఈ నెలాఖరున రిలీజ్ బరిలో దిగిపోతున్నామని నాగచైతన్య - మారుతి అండ్ గ్యాంగ్ చాలా ముందే ప్రకటించారు. ఆగస్టు 31న ఈ కాంబినేషన్ లో `శైలజారెడ్డి అల్లుడు` రిలీజ్ కి వస్తోంది. నాగార్జున తరహాలో చైతూలోని మాస్ ఇమేజ్ - రొమాంటిక్ హీరో యాంగిల్ ని ఎలివేట్ చేసేందుకు తీసిన సినిమా ఇది. అల్లరి అల్లుడు తరహా విజయం ఆశిస్తోంది టీమ్. ఈ సినిమాకి అనూబేబి గ్లామర్ ఓ అస్సెట్ అనుకుంటే - శైలజ అత్తగా సీనియర్ నటి రమ్యకృష్ణ అభినయంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.
అయితే ఈ సినిమాకి పోటీ లేదా? అంటే.. ఒకరోజు ముందే పోటీకి దిగుతున్నాడు నాగశౌర్య. ఉన్నట్టుండి శౌర్య నటించిన `నర్తనశాల` బిగ్ లీగ్ లోకి వచ్చి చేరింది. శౌర్య అసలే దూకుడుమీదున్నాడు. ఛలో - అమ్మమ్మగారిల్లు చిత్రాలతో బంపర్ హిట్లు అందుకుని ఇప్పుడు హ్యాట్రిక్ పైనా కన్నేశాడు. ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీగా నర్తనశాల రిలీజ్ కు ఏర్పాట్లు సాగిపోతున్నాయ్. ఓవర్సీస్ లో యువహీరోల హవా సాగుతున్న వేళ `ఛలో` చిత్రంతో విదేశాల్లో శౌర్య ఇమేజ్ పెంచుకున్నాడు. ఇప్పుడు మరోసారి అతడి హవా సాగుతుందన్న అంచనాలేర్పడ్డాయి. శైలజారెడ్డి అల్లుడు రిలీజ్ కి ఒకరోజు ముందే నర్తనశాలను రిలీజ్ చేస్తున్నామని పోస్టర్ సాక్షిగా ప్రకటించారు. దీంతో శైలజారెడ్డి అల్లుడుకి ఠఫ్ కాంపిటీషన్ మొదలైనట్టేనని విశ్లేషిస్తున్నారు.