Begin typing your search above and press return to search.
శైలజారెడ్డి అల్లుడు.. కెరీర్లోనే నంబర్ వన్
By: Tupaki Desk | 31 July 2018 10:07 AM GMTటాలీవుడ్లో మిగతా పెద్ద హీరోల వారసులతో పోలిస్తే అక్కినేని నాగచైతన్య రేంజ్ తక్కువే. కెరీర్ ఆరంభంలో ఒడుదొడుకులు ఎదురవడంతో.. కుదురుకోవడానికి సమయం పట్టింది. పైగా అతడికి విజయాన్నందించినవన్నీ క్లాస్ సినిమాలే. మాస్ సినిమాల్ని ముట్టుకున్న ప్రతిసారీ పరాజయాలే ఎదురయ్యాయి. దీంతో తనకు నప్పే క్లాస్ లవ్ స్టోరీలే చేసుకుంటూ సాగిపోతున్నాడు తేజు. ఆ కోవలోనే గత ఏడాది ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాలో నటించాడు. అది రూ.25 కోట్ల దాకా షేర్ రాబట్టి సోలో హీరోగా చైతూ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ ఊపులో రెండు క్రేజీ ప్రాజెక్టులు లైన్లో పెట్టాడు చైతూ. అవే.. సవ్యసాచి.. శైలజారెడ్డి అల్లుడు. ఈ రెండు సినిమాలపైనా మంచి అంచనాలున్నాయి. ఇందులో ముందుగా ‘శైలజా రెడ్డి అల్లుడు’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగస్టు 31న విడుదల అని కూడా కన్ఫమ్ చేశారు.
చైతూ ఆల్రెడీ రెండు సూపర్ హిట్లతో ఊపుమీదుంటే.. ఈ చిత్ర దర్శకుడు మారుతి ‘మహానుభావుడు’తో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఈ కాంబినేషన్ కు మంచి క్రేజ్ వచ్చింది. దానికి తగ్గట్లే ఈ చిత్రానికి బిజినెస్ కూడా బాగా జరిగినట్లు తెలుస్తోంది. విడుదలకు చాన్నాళ్ల ముందే దీనికి బిజినెస్ పూర్తయింది. రూ.25 కోట్ల మేర అమ్మకాలు జరిగినట్లు సమాచారం. ఆంధ్రా ప్రాంత ఏరియాల హక్కులు రూ.9 కోట్లు పలికితే.. సీడెడ్ రైట్స్ రూ.3.5 కోట్లకు అమ్ముడయ్యాయట. నైజాం ప్రాంతానికి హక్కులు రూ.6.5 కోట్ల దాకా పలికినట్లు సమాచారం. ఇక రెస్టాఫ్ ఇండియా.. యుఎస్.. ఇతర హక్కులన్నీ కలిపి లెక్క రూ.25 కోట్లకు చేరినట్లు సమాచారం. చైతూ కెరీర్లో అత్యధిక బిజినెస్ చేసింది ఈ చిత్రమే. సినిమాకు మంచి టాక్ రావాలే కానీ పెట్టుబడి వెనక్కి రావడం పెద్ద కష్టమేమీ కాదు. మారుతి సినిమా కాబట్టి మినిమం గ్యారెంటీ అన్న భరోసా ఉంది. అన్నీ కలిసొస్తే చైతూకు ఇది కెరీర్ బిగ్గెస్ట్ హిట్టయినా కావచ్చు. ఈ చిత్రం టీజర్ ఆగష్టు 1వ తేదీన సాయంత్రం 7. 10 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు