Begin typing your search above and press return to search.

సాంగ్ టాక్: ఇల్లే ఇండియా.. దిల్లే ఇండియా

By:  Tupaki Desk   |   26 Jan 2018 1:51 AM GMT
సాంగ్ టాక్: ఇల్లే ఇండియా.. దిల్లే ఇండియా
X
దేశభక్తి సినిమా అంటే అచ్చంగా అలాగే ఉండే సినిమాలు చాలా రేర్ గా వస్తుంటాయి. కాని స్టయిలిష్‌ స్టార్ అల్లు అర్జున్ మాత్రం అలాంటి సినిమాతో వస్తున్నాడంటే.. నిజంగానే రోమాలు నిక్కపొడుచుకునే రేంజు భక్తిని చూపిస్తున్నాడు. దానికి సాక్ష్యం ఇప్పుడు ''నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా'' సినిమాలో 'సైనిక' అనే పాటే. పదండి అసలు ఈ పాటే చూద్దాం.

విశాల్-శేఖర్ మ్యూజిక్ అంటే ఎట్లుంటుందో అని కంగారుపడుతున్న అభిమానులకు.. ఇప్పుడు ఒక దేశభక్తి పాటతో గణతంత్రదినోత్సవం నాడు భలే ట్రీట్ ఇచ్చారు ఈ ఇద్దరూ. ''సరిహద్దను నువ్వు లేకుంటే.. కనుపాప కంటినిండా నిదరపోదురా..'' అంటూ సాగే ఈ పాట ట్యూన్ రోమాలను నిక్కపొడుచుకునే కంపోజిషన్ తో అలరించారు. ముఖ్యంగా విశాల్ వాయిస్ ఈ పాటకు కొత్త రేంజును అద్దేసింది. ''సెలవే లేని సేవకా.. పనిలో పరుగే తీరిక.. ప్రాణం అంతా తేలిక.. పోరాటం నీకో వేడుకా.. ఓ సైనికా'' అంటూ రామజోగయ్య శాస్ర్తి మరోసారి తన కెరీర్ బెస్ట్ లిరిక్స్ ను అందించారనే చెప్పాలి. ఇల్లే ఇండియా.. దిల్లే ఇండియా అంటే.. అదే రేంజులో పాట కూడా ఉంటుందని అనుకోం కాని.. దర్శకుడు వక్కంతం వంశీ మాత్రం ఈ పాటను ఎంచుకుని తన తొలి సినిమాతో ఏదో డిఫరెంట్ గా ప్రయత్నిస్తున్నానని చెప్పకనే చెప్పాడు.

వక్కంతం డైరక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన అనూ ఎమ్మానుయేల్ నటిస్తోంది. అలాగే సీనియర్ హీరో అర్జున్.. మరియు రావు రమేష్‌ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. నాగబాబు.. లగడపాటి శ్రీధర్.. మరియు బన్నీ వాస్ ఈ సినిమాకు ప్రొడ్యూసర్లు. ఏప్రియల్ 13 లేదా 27న సినిమా విడుదలవుతుందని టాక్.