Begin typing your search above and press return to search.
'ఫిదా' పిల్లకి డాన్సే కాదు .. పంచ్ లు కూడా తెలుసు!
By: Tupaki Desk | 24 Dec 2021 1:37 PM GMTనాని - సాయిపల్లవి కాంబినేషన్లో రూపొందిన 'శ్యామ్ సింగ రాయ్' ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, వెంకట్ బోయనపల్లి నిర్మించాడు. కలకత్తా నేపథ్యంలో 70వ దశకంలోని దేవదాసీల జీవన విధానం చుట్టూ అల్లుకున్న కథ ఇది. కృతి శెట్టి .. మడోన్నా సెబాస్టియన్ నటించినప్పటికీ, ప్రధాన కథానాయికగా సాయిపల్లవినే కనిపిస్తోంది. తాజా ఇంటర్వ్యూలో ఆమె రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నలకి తనదైన స్టైల్లో సమాధానమిచ్చింది.
" నానితో రెండవసారి చేయడం ఎలా అనిపించింది?" అనే ప్రశ్నకు ఆమె సమాధానం ఇస్తూ . "ఇది నాని నేను కలిసి చేస్తున్న సెకండ్ సినిమాలా నాకు అనిపించలేదు. ఫస్టు ఫిల్మ్ లో ఎంత కంఫర్టుగా ఉందో అదే ఈ సినిమాలోను కొనసాగింది. ఇద్దరం సెట్లో కలుసుకోగానే హలో .. హాయ్ చెప్పాలి .. కొంచెం పరిచయం కావాలి అనేది అక్కడేం ఉండదు. పని కోసం వచ్చాం కనుక .. ఇద్దరికీ యాక్టింగ్ పైనే దృష్టి కనుక మాట్లాడటం కూడా ఆ ఫార్మెట్ లోనే ఉంటుంది. ఇద్దరం కూడా చేయనున్న సీన్ ను మరింత బెటర్ గా ఎలా చేయాలనే ఆలోచన చేస్తాము" అని చెప్పుకొచ్చింది.
"మీరు సరదాగా నవ్వుతూ .. హీరోను టీజ్ చేస్తూ అల్లరి చిల్లరగా ఉన్న సినిమాలన్నీ పెద్ద బ్లాక్ బస్టర్లు. ఎమోషన్ పార్టు ఎక్కువున్నవి .. మీరు కంటతడి పెట్టినవి జనాలు అంత ఎక్కువుగా లైక్ చేయలేదు .. ఎందుకని? " అని ఒక రిపోర్టర్ అడగ్గా సాయిపల్లవి స్పందిస్తూ .. "ఒక్క 'ఫిదా' మాత్రమే అలా ఉంటుంది. 'లవ్ స్టోరీ'లో నేను ఏడ్చానుగా .. ఏడ్చానా లేదా? చెప్పండి. 'పడి పడి లేచే మనసు'లోను నేను హ్యాపీగా కనిపించాను .. సాడ్ గాను కనిపించాను. అయినా నేను అలా ఆలోచించనండీ.
నేను ఒక యాక్టర్ ను కదా .. 360 రోజుల్లో ఎలా ఉండాలనుకుంటామో .. నేను కూడా అలా పాత్రలను చేయాలనుకుంటాను. ఇంకో ఇరవై .. ముప్పై ఏళ్లలో నేను ఓల్డ్ అయిపోతాను. అప్పుడు నేను తిరిగి చూసుకుంటే మంచి కథలకు సంబంధించిన విషయాలు మాత్రమే నాకు గుర్తుంటాయి. ఆ సినిమా సక్సెస్ .. ఈ సినిమా ఫ్లాప్ అనేదాని కంటే, ఏ సినిమా సెట్లో నేను ఎక్కువ సంతోషంగా ఉన్నాను" అనేదే నాకు గుర్తుంటుంది. ఇప్పటివరకూ నేను చేసిన అన్ని సినిమాల విషయంలోనూ నేను చాలా సంతోషంగా ఉన్నాను .. ఇకపై కూడా అలాగే ఉంటాను" అంటూ ఆ రిపోర్టర్ కి సాయిపల్లవి తనదైన స్టైల్లో పంచ్ ఇచ్చింది.