Begin typing your search above and press return to search.
నేనో రకం.. తమ్ముడి ఆశలు..
By: Tupaki Desk | 15 March 2017 4:59 AM GMTదర్శకుడు పూరీ జగన్నాధ్ రోగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తుంటే.. పూరీ తమ్ముడు సాయిరాం శంకర్ నేనో రకం అంటూ కొత్త సినిమా రిలీజ్ చేసేస్తున్నాడు. కెరీర్ ప్రారంభంలో మంచి స్పీడ్ అందుకున్న ఈ హీరో.. గత కొన్నేళ్లుగా బాగా వెనకబడిపోయాడు. నేనో రకం మూవీ తనకు మంచి బ్రేక్ ఇస్తుందని ఆశిస్తున్నట్లు చెబుతున్నాడు ఈ హీరో.
'లవ్ అండ్ ఎంటర్టెయిన్మెంట్ జోనర్ లో సాగే మూవీ ఇది. అలాగే ఓ చిన్న సోషల్ అవేర్ నెస్ మెసేజ్ కూడా ఉంటుంది. శరత్ కుమార్ పోషించిన రోల్ సినిమాకే హైలైట్ గా ఉంటుంది. ఈ రోల్ కోసం సంప్రదించే సమయానికి.. ఆయన వేరే ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నారు. కానీ ఈ స్టోరీ.. రోల్ ఆయనకు నచ్చి.. వాటిని పక్కన పెట్టి మరీ నేనోరకం చిత్రంలో నటించారు' అని చెప్పాడు సాయిరాం శంకర్. ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అుతున్న సుదర్శన్ శైలేంద్ర చాలా కాలంగా తెలుసని చెప్పిన సాయిరాం.. అతను తీసుకొచ్చిన సబ్జెక్ట్.. కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుని అంటున్నాడు.
'నా గత చిత్రాలు రాంగ్ టైంలో రిలీజ్ అయ్యి పరాజయం పాలయ్యాయి. అరకు రోడ్ లో చిత్రంపై చాలానే హోప్స్ పెట్టుకున్నాను. కానీ డీమానిటైజేషన్ సమయంలో విడుదల కావడంతో.. ఆశించిన విజయం రాలేదు. ఆ నిర్మాతను పోస్ట్ పోన్ చేయమని కూడా అడిగాను' అన్న సాయిరాం శంకర్.. అన్నయ్య పూరీ జగన్నాధ్ ఇప్పటికే తనకు చాలా చేశాడని.. ఇప్పుడు ఏమీ అడగబోనని అన్నాడు. తన కాళ్లపై తాను నిలబడేందుకు ప్రయత్నిస్తూనే ఉంటానని చెప్పాడు సాయిరాం శంకర్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/