Begin typing your search above and press return to search.
4 కోట్ల సినిమా 75 కోట్లు వసూలు చేసింది
By: Tupaki Desk | 1 Jun 2016 11:14 AM GMTతెలుగులో ‘నువ్వే కావాలి’ లాంటి సినిమాలు చేసిన అద్భుతాల గురించి చెప్పుకుంటే భలే ఆసక్తి రేకెత్తిస్తాయి. కేవలం రూ.50 లక్షల బడ్జెట్ తో తెరకెక్కి అప్పట్లోనే పాతిక కోట్ల దాకా వసూలు చేసి సంచలనం సృష్టించింది ఆ సినిమా. ఇలాంటి అద్భుత చిత్రాలు ఇంకొన్ని ఉన్నాయి టాలీవుడ్లో. ఇప్పుడు సేమ్ ఇలాగే మరాఠీలో ఓ సినిమా సంచలనాలు సృష్టిస్తోంది. కేవలం రూ.4 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన ‘సైరాట్’ మూవీ అక్కడ మహారాష్ట్రలో ఏకంగా రూ.75 కోట్ల వసూళ్లు రాబట్టడం విశేషం. త్వరలోనే రూ.100 కోట్ల మార్కును కూడా అందుకునేలా ఉంది. అంటే పెట్టుబడి మీద దాదాపు 25 రెట్ల వసూళ్లన్నమాట.
నూతన నటీనటులు ఆకాష్, రింకూ రాజ్ గురు హీరో హీరోయిన్లుగా నాగరాజ్ మంజులే స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహించిన సినిమా ఇది. మామూలుగా అవార్డు సినిమాలకు కలెక్షన్లు ఉండవంటారు. కానీ ఇటీవలే ప్రకటించిన జాతీయ అవార్డుల్లో ‘స్పెషల్ జ్యూరీ’ పురస్కారం అందుకున్న ఈ సినిమా కమర్షియల్ గానూ సూపర్ సక్సెస్ అయింది. పెద్దగా అంచనాల్లేకుండా విడుదలైన ఈ సినిమా కేవలం మౌత్ టాక్ తోనే పుంజుకుని రెండో వారం నుంచి హౌస్ ఫుల్ కలెక్షన్లతో అదరగొట్టింది.
ముందు ఈ సినిమాను పట్టించుకోని మల్టీప్లెక్సులు తర్వాత చచ్చినట్లు ఈ సినిమాను ప్రదర్శించాల్సి వచ్చింది. 20 రోజుల్లోనే రూ.50 కోట్ల దాకా కొల్లగొట్టిన ఈ చిత్రం.. 31 రోజులకు రూ.75 కోట్ల మార్కును దాటింది. ఇంకా వసూళ్ల ప్రభంజనం కొనసాగుతూ ఉంది. త్వరలోనే వంద కోట్ల మార్కును కూడా అందుకోవడం ఖాయమని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి కూడా సన్నాహాలు జరుగుతుండటం విశేషం.