Begin typing your search above and press return to search.
మాతృపరిశ్రమపై నయన ప్రేమ!!
By: Tupaki Desk | 1 Dec 2015 4:53 AM GMTఎవరైనా హీరోయిన్ ని తన డైరెక్టర్ పొగడాలంటే బోలెడన్ని క్వాలిటీస్ ఉండాలి. ముఖ్యంగా చక్కని ప్రతిభావని అయ్యుండాలి. క్రమశిక్షణ గలదై ఉండాలి. పారితోషికంలో బెట్టు చేయకూడదు. ఇన్ని లక్షణాలు ఒకేచోట కలబోసి ఉండే హీరోయిన్ లు ఈ రోజుల్లో ఎంతమంది ఉన్నారు? ఏదో ఒకచోట లొల్లు తప్పదు. కానీ దశాబ్ధ కాలంగా సౌత్ సినిమాని ఏల్తున్న కథానాయికగా నయనతార పాపులర్. టాప్ రెమ్యునరేషన్ అందుకుంటున్న నాయికగానూ గుర్తింపు తెచ్చుకుంది.
పారితోషికంలో బెట్టు వీడదు. పబ్లిసిటీకి అస్సలు రానే రాదు అన్న విమర్శలున్నాయి. తెలుగు - తమిళ్ లో అప్పట్లో ఈ అమ్మడిపై బోలెడంత నెగెటివ్ ప్రచారం సాగింది. కానీ దీనికి పూర్తి ఆపోజిట్ గా మాట్లాడుతున్నాడు మలయాళ దర్శకుడు సాజన్. ప్రస్తుతం ఈయనగారు మమ్ముట్టి - నయనతార నాయకానాయికలుగా మల్లూవుడ్ లో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నటించమని అడిగినప్పుడు నయన్ ఏమాత్రం నయన్ ఏమాత్రం బెట్టు చేయక ఒప్పేసుకుందిట. సొంత పరిశ్రమలో నటించేందుకు పారితోషికం కూడా అడ్డు కాలేదు. నిజానికి అంత పెద్ద బిజీ స్టార్ అయి ఉండీ పారితోషికంతో పని లేకుండా ఈ సినిమాలో నటించేందుకు అంగీకరించారు నయన్. ఉదయమే 9.30కి సెట్స్ కి రావాలని చెబితే అరగంట ముందే అక్కడ ఉంటారు. ఎంతో క్రమశిక్షణ ఉన్న నటి.. అంటూ కితాబిచ్చేశాడు.
దీన్నిబట్టి ఏమర్థమైంది? మనిషి మనిషికో ట్రీట్ మెంట్. పరిశ్రమని బట్టి డిమాండ్. అదీ నయన్ స్ర్టాటజీ. అలా ఉంటే తప్పేం లేదు. మనుషుల్ని బట్టి, అవసరాన్ని బట్టి ట్రీట్ చేయడం నేర్చుకోకపోతే సీనియర్ నటి అనిపించుకుంటుందా?