Begin typing your search above and press return to search.
సఖి.. సామాన్యుడు మంచి ఛాన్స్ మిస్
By: Tupaki Desk | 8 Feb 2022 8:57 AM GMTకరోనా థర్డ్ వేవ్ వల్ల మరోసారి బాక్సాఫీస్ వెలవెల కనబడుతోంది. జనవరి నుండి మొదలుకుని ఇప్పటి వరకు బాలీవుడ్ లో పెద్ద సినిమాలు ఏమీ విడుదల కాలేదు. కాని తెలుగు లో సంక్రాంతికి బంగార్రాజు తో పాటు కొన్ని సినిమాలు విడుదల అయ్యి సందడి చేసే ప్రయత్నం చేశాయి. అయితే సంక్రాంతి తర్వాత పరిస్థితి నార్మల్ గానే ఉన్నా కూడా పెద్ద సినిమాలు విడుదలకు ముందుకు రాలేదు. మీడియం బడ్జెట్ సినిమాలు మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
చిన్న సినిమాలు డబ్బింగ్ సినిమాలు మీడియం సినిమాలు ఇలా సంక్రాంతి సీజన్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వారం వారం వస్తూనే ఉన్నాయి. అందులో ప్రథానంగా చర్చ జరిగిన సినిమాలు కీర్తి సురేష్ నటించిన గుడ్ లక్ సఖి మరియు విశాల్ నటించిన సామాన్యుడు. గుడ్ లక్ సఖి సినిమా గత వారం విడుదల అవ్వగా ప్రేక్షకుల తిరస్కరణకు గురి అయ్యింది. ఇక మొన్న శుక్రవారం విశాల్ నటించిన డబ్బింగ్ మూవీ సామాన్యడు విడుదల అయ్యింది.
ఈ రెండు సినిమాలు కూడా పోటీ లేక పోవడంతో సాలిడ్ రిలీజ్ ను దక్కించుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భారీగా వీరికి థియేటర్లు దక్కాయి. విశాల్ నటించిన సామాన్యుడు సినిమా కు గతంలో విశాల్ నటించిన ఏ ఒక్క సినిమాకు దక్కని థియేటర్లు దక్కాయి. దాంతో మంచి వసూళ్లు నమోదు అవ్వడం ఖాయం అని అంతా భావించారు. కీర్తి సురేష్ సినిమాకు కూడా బిగ్ రిలీజ్ అవకాశం దక్కింది. సోలో రిలీజ్ ను ఈ సినిమాలు సద్వినియోగం చేసుకోలేక పోయాయి.
మినిమం వసూళ్లను దక్కించుకోలేక చేతులు ఎత్తేశాయి. సినిమాలు మినిమం పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకున్నా కూడా పోటీ సినిమాలు లేక పోవడం వల్ల జనాలు థియేటర్లకు క్యూ కట్టే వారు. తద్వారా భారీగా వసూళ్లు నమోదు అయ్యేవి అంటూ ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం. కాని దురదృష్టం కొద్ది రెండు సినిమాలు కూడా నెగటివ్ టాక్ ను నెగటివ్ రివ్యూలను దక్కించుకున్నాయి. దాంతో వసూళ్ల విషయంలో మరీ దారుణమైన నెంబర్స్ నమోదు అయ్యాయి.
గుడ్ లక్ సఖి సినిమా వసూళ్లు మరీ దారుణంగా ఉన్నాయని.. కీర్తి సురేష్ స్థాయికి ఆ వసూళ్లు అంటే నమ్మశక్యంగా లేవు అంటున్నారు. ఇక విశాల్ డబ్బింగ్ మూవీ సామాన్యుడు కు మొదటి రోజు కేవలం 50 లక్షల షేర్ మాత్రమే వచ్చిందట. సరే సినిమా లాంగ్ రన్ లో జనాల దృష్టిలో పడి మరే సినిమాలు లేక పోవడంతో క్యూ కడుతారని మేకర్స్ భావించారు. కాని రెండవ రోజు మూడవ రోజు కూడా అంతకు దారుణమైన వసూళ్లు వచ్చాయట.
దాంతో చాలా థియేటర్లు మూడవ రోజే సినిమాను తొలగించాయని తెలుస్తోంది. థియేటర్ల మెయింటెన్స్ కూడా రాకపోవడంతో చాలా చోట్ల తొలగించారనే టాక్ వినిపిస్తుంది. ఈ రెండు సినిమాలు కూడా ఒక మంచి టైమ్ లో విడుదల అయినా కూడా దురదృష్టం కొద్ది అట్టర్ ప్లాప్ అయ్యి మంచి వసూళ్లను మిస్ చేసుకున్నారు. ఈనెలలో పెద్ద సినిమాల విడుదల జోరు మొదలు అయ్యింది. ఖిలాడి నుండి మొదలుకుని వరుసగా క్రేజీ సినిమాలు మే వరకు బాక్సాఫీస్ వద్దకు రాబోతున్నాయి. అందులో ఏ సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేస్తాయి.. ఏవి నిరాశ పర్చుతాయో చూడాలి.