Begin typing your search above and press return to search.

ఆడియో రివ్యూ:మైమరపు ప్లస్ జలదరింపు

By:  Tupaki Desk   |   10 July 2018 8:10 AM GMT
ఆడియో రివ్యూ:మైమరపు ప్లస్ జలదరింపు
X
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా శ్రీవాస్ దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్ నిర్మించిన సాక్ష్యం ఈ నెల 27 విడుదలకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో పంచభూతాల కాన్సెప్ట్ ని రివెంజ్ ఫార్ములాకు జోడించినట్టుగా ట్రైలర్ లో ఒక అవగాహన ఇచ్చే ప్రయత్నం చేసిన సాక్ష్యం టీమ్ ఆడియో విషయంలో బాగా శ్రద్ధ తీసుకున్నట్టు కనిపిస్తోంది. హర్షవర్ధన్ రామేశ్వర్ ఇచ్చిన ట్యూన్స్ తో పాటు సింగల్ కార్డు గా అనంత శ్రీరామ్ అందించిన సాహిత్యం హై లైట్ గా నిలుస్తోంది. ఇక ఆల్బమ్ విషయానికి వస్తే మొత్తం 33 నిమిషాల వ్యవధిలో మొత్తం 6 పాటలు ఇందులో ఉన్నాయి.

డెస్టినీ డెస్టినీ అంటూ హీరో పరిచయ గీతంగా అనిపిస్తున్న పాటలో జీవితంలో సరదాల గురించి అనుభవించాల్సిన వాటి గురించి చెప్పిన తీరు హుషారైన ట్యూన్ కి మంచి బీట్ గా అనిపించింది. హర్షవర్ధన్ తో పాటు హరిచరన్-జితిన్ కూడా స్వరం కలిపారు.

ఇక రెండో ఇష్క్ కర్లె అంటూ క్యాచీ ట్యూన్ తో హీరో హీరోయిన్ మధ్య డ్యూయెట్ గా ఉంది. నువ్వే మంత్రం వేసావే అలై నన్ను అల్లావే అంటూ పదాల ప్రాసతో ఆడేసాడు అనంత శ్రీరామ్.

ఇక మూడో ట్రాక్ గా సౌందర్య లహరి సాఫ్ట్ మెలోడీ. జితిన్-ఆర్తిల మంద్రమైన గొంతులో క్లీన్ గా కంపోజ్ చేసిన ఈ పాట ఆల్బమ్ మొత్తంలో స్వీట్ అనిపించేదిగా వినిపిస్తుంది. ఇక డుంగు డుంగు అంటూ హీరో పెళ్లి లేదా నిశ్చితార్థం వేడుక నేపథ్యంలో వచ్చే పాట హుషారుగా క్యాచీగా ఉంది. చివరి పాటగా విన్పించే చెలియా చూడే మసాలా బీట్ సాంగ్. హీరో హీరోయిన్ల మధ్య బహుశా క్లైమాక్స్ కు ముందు కిక్ ఇచ్చేలా కంపోజ్ చేసినట్టు ఉంది.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే సాక్ష్యం కథలో థీమ్ ని ప్రెజెంట్ చేస్తూ 12 నిమిషాలకు పైగా సాగే శివమ్ శివమ్ భవ హరమ్ హరమ్ అనే పాట వెంటాడుతూనే ఉంటుంది. పంచభూతాలకు ప్రతినిధులుగా ఎస్పి బాలసుబ్రమణ్యం-జేసుదాస్-హరిహరన్-కైలాష్ ఖేర్-బొంబాయి జయశ్రీ ఆలపించిన ఈ గీతం రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది. ఇకపై భక్తి ప్రధానమైన కార్యక్రమం ఎక్కడ జరిగినా ఈ పాట మారుమ్రోగిపోవడం ఖాయం. మొత్తానికి తన మీద పెట్టిన పెద్ద భారాన్ని సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ సమర్ధవంతంగా నిర్వహించాడు.

అర్జున్ రెడ్డికి అద్భుతమైన నేపధ్య సంగీతాన్ని అందించిన హర్షవర్ధన్ సాక్ష్యం విషయంలో తన పాత్రకు పూర్తి న్యాయం చేసి భారీ ప్రాజెక్టులను సైతం టేక్ అప్ చేయగలను అని నిరూపించాడు. ఫైనల్ గా చెప్పాలంటే ఈ ఆడియో మ్యూజిక్ పరంగా సక్సెస్ కు శుభసూచకంగా కనిపిస్తోంది.

వీడియో కోసం క్లిక్ చేయండి