Begin typing your search above and press return to search.

ఈ అమ్మడి 'గ్లామర్'కి అందాలే సాక్షి!

By:  Tupaki Desk   |   12 May 2020 1:30 AM GMT
ఈ అమ్మడి గ్లామర్కి అందాలే సాక్షి!
X
సాక్షి అగర్వాల్.. ఈ పేరు తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం లేదు. కానీ తమిళ కన్నడ మలయాళం ఇండస్ట్రీ ప్రేక్షకులకు సాక్షి సుపరిచితమే. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనిటాల్ లో పుట్టి పెరిగిన ఈ భామ.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిగ్రీ పూర్తిచేసి చెన్నైలోని అన్న యూనివర్సిటీ నుండి ఎంబిఏ పట్టా పొందింది. మొదటగా మార్కెటింగ్ కన్సల్టెంట్ గా పనిచేసి ఓ ఛారిటీ ఫ్యాషన్ షో ద్వారా మోడలింగ్ వైపు మళ్లింది. ఆ తర్వాత యాడ్ ఫిలిమ్స్ లో కనిపించి ప్రింట్ మీడియా, టెలివిజన్ ఫ్యాషన్ షోలకు మోడల్ గా మారింది. అనంతరం ఇన్ఫోసిస్ లో జాబ్ వదిలేసి పూర్తి నటన పై దృష్టి సారించి నటనలో శిక్షణ పొందింది. ఇక సూపర్ హిట్ రాజారాణి సినిమాలో చిన్న సన్నివేశంలో కన్పించి తర్వాత కొన్ని కన్నడ మలయాళ సినిమాలలో మెరిసి కాలా సినిమాలో రజినీకాంత్ కోడలిగా నటించింది.

కెరీర్ ప్రారంభంలో కొన్ని వీడియో ఆల్బమ్స్ కూడా చేసిన సాక్షి. తమిళ బిగ్ బాస్ షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ప్రస్తుతం లాక్ డౌన్ లో ఇంటికే పరిమితమైన ఈ భామ సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక ఇంట్లో ఖాళీగా ఉండటం ఎందుకని ఫ్యాన్స్ కోసం ఫోటో షూట్లు చేస్తూ.. అలరిస్తుంది. ఇటీవలే సారీ అందాలతో మతులు పోగొట్టిన అమ్మడు తాజాగా లెహెంగాలో పిచ్చేక్కిస్తుంది. వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో సిగ్గు పడుతూ ఇచ్చిన ఫోజులకు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అంతా ఫిదా అవుతున్నారు. ఎప్పుడు గ్లామర్ షో చేసే సాక్షి అమ్మడు లెహెంగాలో తన అందాలను సాక్షంగా నిలుపుతుంది. ఈ ఫోటోలలో అమ్మడిని చూస్తే కన్నుల పండుగలా ఉందని నెటిజన్లు కామెంట్స్ వెల్లువ కురిపిస్తున్నారు. తాజాగా అమ్మడు నటించిన సిండ్రెల్లా సినిమా విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే.