Begin typing your search above and press return to search.

మగధీర కంటే వందేళ్లు వెనక్కి!!

By:  Tupaki Desk   |   20 July 2017 4:29 AM GMT
మగధీర కంటే వందేళ్లు వెనక్కి!!
X
టాలీవుడ్ లో మగధీర సృష్టించిన సంచలనాలు చాలాకాలమే కొనసాగాయి. 400 ఏళ్ల ప్రేమ కథను.. ప్రస్తుత జనరేషన్ తో లింక్ చేసి.. రామ్ చరణ్ తో రాజమౌళి తెరక్కించిన ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు ఓ సినిమా కోసం మరింత వెనక్కి వెళ్లిపోతున్నారు మేకర్స్.

రామ్ చరణ్ మూవీ 400 ఏళ్ల క్రితం నాటి కథ అయితే.. 500 ఏళ్ల క్రితం కథ అంటూ సువర్ణ సుందరి చిత్రం వస్తోంది. జేమ్స్ బాండ్ వంటి చిత్రంలో నటించిన సాక్షి చౌదరి.. ఈ పీరియాడిక్ ఫిలింతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అప్పటి కాలంతో పాటు.. ఆ కాలంలో ఉన్నాయని భావించే అతీత శక్తులను ఈ చిత్రంలో చూపించనున్నారట. 'ఈ సినిమా కథ 1509లో మొదలయ్యి ప్రస్తుత కాలం వరకూ ఉంటుంది. బిహార్.. అనంతపూర్.. హైద్రాబాద్.. బెంగళూరు ప్రాంతాల్లో ఒరిజినల్ లొకేషన్స్ లో ఎక్కువగా చిత్రీకరించాం. పీరియాడిక్ మూవీ అనే ఫీలింగ్ కోసం చాలానే గ్రాఫిక్ వర్క్ అవసరం అవుతుంది' అని చెప్పాడు దర్శకుడు సూర్య.

'సహజంగా చరిత్రంలో మనకు అన్నీ సక్సెస్ స్టోరీలే కనిపిస్తాయి. కానీ చరిత్రలో ఉండే చెడు కోణాన్ని.. ప్రస్తుత సమాజంపై దాని ప్రభావాన్ని చూపించబోతున్నాం' అంటున్నాడు ఈ దర్శకుడు. సాక్షి చౌదరి ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ మూవీలో.. హారర్ సినిమాలతో వరుసగా భయపెడుతున్న పూర్ణ మరో కీలక పాత్రలో కనిపించనుంది.