Begin typing your search above and press return to search.
రామాయణం నటుడి మనవరాలు గ్లామర్ డోస్
By: Tupaki Desk | 20 Jan 2023 2:30 AM GMTబుల్లితెర ఆడియెన్ కి సుపరిచితుడైన ఫిలింమేకర్ రామానంద్ సాగర్ మనవరాలు సాక్షి చోప్రా నిరంతర యాక్టివిటీస్ మీడియా అండర్ స్కానర్ లో ఉంటాయన్న సంగతి తెలిసిందే. రామానంద్ సాగర్ మునిమనవరాలు సాక్షి చోప్రా సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. టిక్ టాక్ - ఇన్ స్టాలో లక్షల్లో అభిమానులను కలిగి ఉంది.
చోప్రా తనదైన శైలి గ్లామరస్ షూట్లతో బాగా ప్రాచుర్యం పొందింది. బిగ్ బాస్ 14లో ఇంటి సభ్యురాలిగా అలరించిన ఈ బ్యూటీ లాస్ ఏంజెల్స్ LA- ఆధారిత గాయనిగా గేయరచయితగాను సుపరిచితురాలు. నిరంతరం రెచ్చగొట్టే ఫోటోషూట్లతో తరచుగా హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. సినీ నిర్మాత మీనాక్షి సాగర్ సాక్షి చోప్రా తల్లి. బిగ్ బాస్ 14లో సెన్సేషన్ సాక్షి చోప్రా హాట్ పిక్చర్స్ గురించి నిరంతరం నెటిజనులలో బిగ్ డిబేట్ నడుస్తోంది! అమెరికాలో ఉంటున్న సాక్షి చోప్రా సంగీత విద్వాంసురాలు కావాలనుకుంటోంది. ఆమెకు ఇన్ స్టాగ్రామ్ లో 546K కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ గా... ఫోటో అండ్ రీల్-షేరింగ్ యాప్ లలో తన బికినీ ఫోటోలు వీడియోలు టాప్ లెస్ షాట్ లతో.. కిక్కు పెంచే భంగిమలతో ఆకట్టుకుంటోంది. సూపర్ డూపర్ సెక్సీ స్టైల్ తో గుబులు పుట్టించే ఈ బ్యూటీ పై నిరంతరం సోషల్ మీడియా యూత్ ఎంతో ఆసక్తిని చూపెడుతుండడంతో దానికి తగ్గట్టే సాక్షి కి పలు కార్పొరెట్ ప్రకటనల రూపంలో ఆదాయం బావుందని తెలిసింది.చోప్రా యూట్యూబ్ లో కూడా చాలా పాపులరైంది. లేడీ గాగా 'మిలియన్ రీజన్స్' మొదటి వెర్షన్ ఖలీద్ 'లొకేషన్' ఆమె రెండవ కవర్ రెండూ యూట్యూబ్ లోకి అప్ లోడ్ చేశాక దుమారం రూపాయి.
తన బోల్డ్ ఫోటోషూట్లపై విరుచుకుపడే విమర్శలకు సాక్షి చోప్రా చాలా కాలం క్రితం ఘాటుగా ప్రతిస్పందించింది. "మహిళలు తమకు నచ్చిన దుస్తులు ధరించడానికి అనుమతించాలని నేను భావిస్తున్నాను. కేవలం ఒక ధరించే దుస్తుల ఆధారంగా ఒకరినొకరు అంచనా వేయడం మూర్ఖత్వం. నేను అలాంటి ఫోటోలను ఎందుకు షేర్ చేస్తున్నానో మా అమ్మ నన్ను అడిగారు. కానీ నన్ను నాలాగే ఉండనివ్వమని చెప్పినప్పుడు అమ్మ నన్ను గౌరవించింది" అని తెలిపారు.
ఇక సాక్షి ఎఫైర్ కహానీ గురించి బోలెడంత చర్చ సాగుతోంది. రోహిత్ గోలియాతో సాక్షి సంబంధంపై చాలా వార్తలు వచ్చాయి. అయితే కళాకారిణి విషయంలో అలాంటి పుకార్లు సహజమేనంటూ అన్నింటినీ కొట్టిపారేసింది. సాక్షి తనను తాను అవివాహిత అని తెలిపింది. ఒక సంవత్సరం క్రితం తన చివరి బ్రేకప్ గురించి ఓపెన్ గా మాట్లాడింది. దాపరికం అన్నదే లేని నటి కం మోడల్ సాక్షి చోప్రా. మామిక్ సింగ్ సాక్షికి సవతి తండ్రి. 2018లో మీనాక్షి - మామిక్ ల వివాహం జరిగింది. నటుడు ఆకాష్ చోప్రా సాక్షికి మేనమామ.
రామానంద్ సాగర్ అజేయమైన చరిత్ర రామానంద్ సాగర్ (జన్మనామం చంద్రమౌళి చోప్రా) పాపులర్ దర్శకనిర్మాత. దూరదర్శన్ లో ప్రసారమై విశేష జనాదరణ పొందిన ధారావాహిక (సీరియల్) 'రామాయణ్'ను అతడు నిర్మించాడు. 78 భాగాల ఈ టెలివిజన్ ధారావాహిక భారతీయ పురాతన ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కింది. ఈ సీరియల్ లో శ్రీరామునిగా అరుణ్ గోవిల్ సీతగా దీపికా చికాలియా నటించారు. భారత ప్రభుత్వం అతడిని 2000వ సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
రామానంద్ సాగర్ లాహోర్ సమీపంలోని అసల్ గురు గ్రామంలో జన్మించాడు. ఇతడి ముత్తాత లాలా శంకర్ దాస్ చోప్రా కాశ్మీర్ కు వలస వెళ్ళాడు. ఇతని అమ్మమ్మకు మగ సంతానం లేనందువల్ల ఇతడిని దత్తత తీసుకుంది. ఆ కారణంగా అతడి పేరును చంద్రమౌళి చోప్రా నుండి రామానంద్ సాగర్ గా మార్చారు. రామానంద్ తల్లి మరణానంతరం అతని తండ్రి మరో పెళ్ళి చేసుకున్నాడు. విదు వినోద్ చోప్రా ఇతని సవతి తల్లి కుమారుడు. రామానంద్ సాగర్ పగటిపూట ప్యూన్ గా ట్రక్కు క్లీనర్ గా కంసాలి వద్ద సహాయకుడిగా పలు పనులు చేస్తూ రాత్రి పూట డిగ్రీ చదువుకున్నారు.
1942లో ఇతడు పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి సంస్కృతం- పర్షియన్ భాషలలో బంగారు పతకాలను పొందాడు. డైలీ మిలాప్ అనే పత్రికకు సంపాదకుడిగా ఉన్నాడు. ఇతడు రామానంద్ చోప్రా- రామానంద్ బేడీ- రామానంద్ కాశ్మీరీ అనే కలం పేర్లతో ఎన్నో కథలు- నవలలు- కవితలు- నాటికలు రచించాడు.
1932లో రామానంద్ సాగర్ రైడర్స్ ఆఫ్ ద రైల్ రోడ్ అనే మూకీ చిత్రానికి క్లాపర్ బాయ్‌గా తన సినీ జీవితాన్ని ప్రారంభించాడు. దేశవిభజన అనంతరం 1949లో ఇతడు ముంబైకి తన మకాం మార్చాడు. 1940లలో పృథ్వీరాజ్ కపూర్ ఆధీనంలోని పృథ్వీ థియేటర్స్ లో ఇతడు అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేశాడు. కపూర్ పర్యవేక్షణలో కొన్ని నాటకాలకు దర్శకత్వం వహించాడు. కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించడంతో పాటు ఇతడు రాజ్ కపూర్ సూపర్ హిట్ సినిమా బర్సాత్ కి కథ- స్క్రీన్‌ప్లే అందించాడు. ఇతడు సాగర్ ఫిల్మ్స్ (ప్రైవేట్ లిమిటెడ్) అనే సినిమా- టెలివిజన్ నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. బాజూబంద్- మెహమాన్ వంటి సినిమాలను దర్శకత్వం వహించి నిర్మించాడు కానీ అవి అంతగా విజయవంతం కాలేదు.
ఎస్.ఎస్.వాసన్ దర్శకత్వంలో దిలీప్ కుమార్ - వైజయంతిమాల, రాజ్ కుమార్ లు నటించిన పైగమ్ చిత్రానికి ఇతని 1960లో ఫిల్మ్ ఫేర్ ఉత్తమ సంభాషణల రచయిత అవార్డ్ లభించింది. అటుపై 1960 కాలంలో ఘుంఘట్, అర్జూ వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 1964లో రాజేంద్ర కుమార్- వైజయంతిమాల- పృథ్వీరాజ్ కపూర్- రాజ్ కుమార్ లు నటించిన జిందగీ అనే కళాత్మక చిత్రానికి దర్శకత్వం వహించాడు. 1968లో ధర్మేంద్ర- మాలా సిన్హా జంటగా నిర్మించిన స్పై థ్రిల్లర్ సినిమా ఆంఖే చిత్రం ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ దర్శకుడు అవార్డ్ ను సంపాదించి పెట్టింది. 1970వ దశకం తొలి దశలో ఇతని సినిమాలు గీత్- లల్ కార్ విజయవంతం కాలేదు. 1976లో ధర్మేంద్ర- హేమా మాలిని జంటగా చరస్.. 1979లో రాజేష్ ఖన్నా- రేఖ- మౌసమీ చటర్జీలు నటించిన ప్రేమ్ బంధన్ వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 1982లో ధర్మేంద్ర- హేమా మాలిని- రీనా రాయ్ లు నటించగా రామానంద్ దర్శకత్వం వహించిన భాగవత్ సినిమా ఘనవిజయాన్ని సాధించింది. 1985లో ఇతడు దర్శకుడిగా పనిచేసిన సల్మా చిత్రం సంగీతపరంగా జనాదరణ లభించినా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది.
1985లో ఇతడు టెలివిజన్ రంగంలోకి ప్రవేశించాడు. మోతీ సాగర్ దర్శకత్వంలో దాదా దాదీకి కాహానియా సీరియల్ ను నిర్మించాడు. అది మొదలు ఇతని సంస్థ సాగర్ ఆర్ట్స్ భారతీయ చరిత్రకు సంబంధించిన టెలివిజన్ సీరియళ్లను నిర్మించడం ప్రారంభించింది. ఇతడు దర్శకత్వం వహించిన రామాయణ్ దూరదర్శన్‌లో 1987 జనవరి 25న మొదటి ఎపిసోడ్ ప్రసారమయ్యింది. దీని తరువాత కృష్ణ- లవ్ కుశ్ టెలీసీరియళ్ళను నిర్మించి దర్శకత్వం వహించాడు. 1988లో ఇతడు విక్రమ్ ఔర్ భేతాళ్ అనే సీరియల్ కు దర్శకత్వం వహించాడు. ఆ తర్వాత అలీఫ్ లైలా- సాయిబాబా టెలీసీరియళ్లను తీశాడు.
రామాయణ్ ధారావాహికను మొదట 52 వారాలలో ప్రసారం చేయడానికి నిర్మించాడు. అయితే ఆ ధారావాహికకు వచ్చిన ప్రజాదరణ దృష్ట్యా మూడుసార్లు పొడిగించి చివరకు 78 వారాలు ప్రసారం చేశారు. ప్రధానమంత్రి కార్యాలయం నుండి వచ్చిన అభ్యర్థన మేరకు ఇతడు లవ్ కుశ్ సీరియల్‌ను నిర్మించాడు. భారత పాకిస్తాన్ విభజన సమయంలో తన అనుభవాలను వివరిస్తూ హిందీ - ఉర్దూ భాషలలో ఔర్ ఇన్సాన్ మర్ గయా అనే పుస్తకాన్ని 1948లో ప్రచురించాడు. 2000లో భారతప్రభుత్వం ఇతడిని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఇతడు తన 88వ యేట అనారోగ్య కారణాలతో ముంబైలోని తన స్వగృహంలో 2005 డిసెంబర్ 12న మరణించాడు. అతడి జీవితచరిత్రను 'ఏన్ ఎపిక్ లైఫ్: రామానంద్ సాగర్ ఫ్రమ్ బర్సాత్ టు రామాయణ్' అనే పేరుతో ఇతని కుమారుడు ప్రేమ్ సాగర్ 2019 డిసెంబర్ లో విడుదల చేసాడు. ఇందులో అట్టడుగు స్థాయి నుండి గొప్ప ఫిల్మ్‌మేకర్ గా ఎదిగడానికి జీవితంలో ఇతడు ఎదుర్కొన్న కష్టాలను వివరించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.