Begin typing your search above and press return to search.
సాక్ష్యం స్ట్రాంగ్ గానే ఉంది
By: Tupaki Desk | 31 July 2018 6:10 AM GMTబెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందిన సాక్ష్యం మొన్న విడుదలైన వాటిలో బెటర్ టాక్ తో డ్రాప్ మరీ ఎక్కువ లేకుండా కొనసాగడం పట్ల దీని మీద పెట్టుబడి పెట్టిన ట్రేడ్ ని సంతృప్తి పరుస్తోంది. కలెక్షన్లు పర్వాలేదు అనే స్థాయిలో ఉండటంతో సోమవారం కూడా పూర్తిగా పడకుండా స్టడీగా ఉండటం ఊరట కలిగించే విషయం. రిలీజ్ రోజు మితిమీరిన అంచనాల కారణంగా డివైడ్ టాక్ వచ్చిన మాట నిజమే కానీ న్యూట్రల్ గా చూస్తే బాగానే ఉందే అనే ఫీలింగ్ కలిగిన మాట జనరల్ పబ్లిక్ లో ఇప్పుడిప్పుడే వెళ్తోంది. ఇది ఇలాగే కొనసాగితే నష్టాలు రాకుండా సాక్ష్యం సేఫ్ గా బయట పడవచ్చు. ఈ శుక్రవారం మూడు స్ట్రెయిట్ సినిమాలు వస్తున్న నేపధ్యంలో ప్రభావం ఉంటుంది కాబట్టి వాటికొచ్చే టాక్ ని బట్టి సాక్ష్యం ఎంత వరకు ఎఫెక్ట్ అవ్వొచ్చు అనేది ఆధారపడి ఉంటుంది.
మొదటివారంతానికి సుమారు 8 కోట్లకు పైగా షేర్ రాబట్టిన సాక్ష్యం మొదటివారం పూర్తయ్యే లోపు 15 కోట్లు దాటిస్తే మంచి మార్కు అనుకోవచ్చు. అంతకు మించి వెళ్తే మాత్రం హిట్ స్టాంప్ పడే అవకాశాలు ఉన్నాయి. పంచభూతాల సహాయంతో రివెంజ్ అనే పాయింట్ ని దర్శకుడు శ్రీవాస్ డీల్ చేసిన తీరు మెల్లగా కనెక్ట్ అవుతోందన్న విషయం దీన్ని బట్టి స్పష్టమవుతోంది. పూజా హెగ్డే గ్లామర్ తో పాటు హర్షవర్ధన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్లస్ అయిన సాక్ష్యం కంటెంట్ పరంగా అతని సినిమాల్లో బెటర్ అనే టాక్ అయితే వినిపిస్తోంది. రానున్న శనివారం మూడు కొత్త సినిమాల రిజల్ట్ బయటికి వచ్చాక సాక్ష్యం స్టాండ్ ఏంటి అనే దాని గురించి పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది.