Begin typing your search above and press return to search.
'సాక్ష్యం' ఫైనల్ రిజల్ట్ ఇదే
By: Tupaki Desk | 3 Aug 2018 12:41 PM GMTఘనమైన ప్రచారానికి తగ్గట్టే సినిమాలో కంటెంట్ ఉంటే ప్రేక్షకులు పట్టంకడుతున్న రోజులివి. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇటీవల రిలీజవుతున్న సినిమాల సరళి పరిశీలిస్తే కామన్ ఆడియెన్ కి అయినా అర్థమవుతున్న విషయమిది. గ్రిప్పింగ్ స్టోరీ - స్క్రీన్ ప్లేతో ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించే సన్నివేశాలతో సినిమా చూపిస్తే జనం కళ్లు తిప్పుకోకుండా చూస్తున్నారు. బావున్న సినిమాని మౌత్ పబ్లిసిటీ చేస్తున్నారు. స్టార్ హీరో - కొత్త హీరో అన్న విభేధమే లేకుండా అందరినీ తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇదే తరహా కాన్ఫిడెన్స్ తో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా శ్రీవాస్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ తో సాక్ష్యం చిత్రం తెరకెక్కించి రిలీజ్ చేశారు. అయితే వాస్తవికంగా ఈ సినిమా బాక్సాఫీస్ ఫలితం ఏంటి? అంటే ఇదీ సంగతి.
పంచభూతాల కాన్సెప్టుతో ఆద్యంతం రక్తి కట్టించే విజువల్స్ తో `సాక్ష్యం` తీశామని దర్శకనిర్మాతలు తెలిపారు. కథ - కంటెంట్ పై కాన్ఫిడెన్స్ తోనే ఈ సినిమా తీశామని పక్కా కాన్ఫిడెన్స్ చూపించారు. అయితే ఈ సినిమాపై సమీక్షకులు మాత్రం తొలిరోజు పెదవి విరిచేశారు. విజువల్ గ్రాండియారిటీకి ఉన్నంత ప్రాధాన్యత ఇతర ఏ అంశాల్లోనూ కనిపించలేదని విమర్శించారు. అందుకు తగ్గట్టే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా తేలిపోయిందని ట్రేడ్ చెబుతోంది. తొలిరెండ్రోజులు ఓపెనింగులు ఫర్వాలేదనిపించినా సోమవారం నాటికి వసూళ్ల పరంగా డౌన్ పాల్ మొదలైందని టిక్కెట్ విండో చెబుతోంది. అయితే నవతరం హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటనకు మాత్రం విమర్శకులు సహా ప్రేక్షక జనం మంచి మార్కులే వేశారు. అతడు ఈ సినిమా కోసం శ్రమించిన తీరు విజువల్ గా కనిపించిందన్న ప్రశంసలొచ్చాయి. ఇక శరీర దారుడ్యం పరంగానూ శీనూ చాలానే శ్రమించాడని పోస్టర్లు రివీల్ చేశాయి. అతడిలో సినిమా సినిమాకి పరిణతి కనిపిస్తోంది. సాక్ష్యం ఫలితం ఏదైనా మునుముందు అతడికి సరైన కథ - దర్శకుడు కుదిరితే తప్పకుండా షైన్ అవుతాడన్న పాజిటివ్ నోట్ రావడం సానుకూలాంశం. ఈ సీజన్ వరకూ `ఆర్ ఎక్స్ 100` మాత్రం చక్కని విజయం అందుకుంది. ఇతరత్రా సినిమాలేవీ ఆడలేదు. ఇక నేడు రిలీజైన `గూఢచారి`కి చక్కని సమీక్షలు వచ్చాయి. సోమవారం నాటికి ఈ సినిమా అసలు సత్తా ఎంతో తేల్తుందేమో చూడాలి.