Begin typing your search above and press return to search.
సముద్రంలో 'సలార్' క్లైమాక్స్.. డార్లింగ్ ఫ్యాన్స్ ఆందోళన
By: Tupaki Desk | 30 May 2022 5:28 AM GMT'కేజీఎఫ్'తో నేషనల్ వైడ్ గా సూపర్ పాపులర్ అయిన కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో 'సలార్' అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ కిరాగందుర్ హై బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతి బాబు, ఈశ్వరీ రావు, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు ఇందులో ముఖ్య పాత్రలను పోషిస్తుండగా.. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.
గత ఏడాదే సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం కొంత షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. ఆ తర్వాత కరోనా మళ్లీ విజృంభించడం మరియు ఇతర కారణాల వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. అయితే గత వారమే ప్రశాంత్ నీల్ సలార్ చిత్రీకరణను రీ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో ప్రభాస్ పై కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారట.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా క్రైమాక్స్ కు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే.. సలార్ క్లైమాక్స్ మొత్తం సముద్రంలో జరుగుతుందట.
ముఖ్యంగా సముద్రం లోపల చేసే ఛేజింగ్ యాక్షన్ సీక్వెన్స్ ఓ రేంజ్ లో ఉంటుందని, సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గానీ.. ఈ ప్రచారం పట్ల డార్లింగ్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అందుకు కారణం లేకపోలేదు. ప్రభాస్ గత చిత్రమైన 'రాధేశ్యామ్' క్లైమాక్స్ కూడా సముద్రంలోనే ఉంటుంది. కె.రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీ మార్చి 11న ఎన్నో అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. రాధేశ్యామ్ దెబ్బకు నిర్మాతలు, బయ్యర్లు భారీగా నష్టపోయారు. ఈ సినిమా విజయం సాధించకపోవడానికి బలహీనమైన క్లైమాక్స్ ఒక కారణం.
ఈ నేపథ్యంలోనే సముద్రంలో 'సలార్' క్లైమాక్స్ అంటే డార్లింగ్ ఫ్యాన్స్ భయపడుతున్నారు. అంతేకాదు, ప్రభాస్ కు సముద్రం కలిసి రాలేదని, మరెక్కడైనా సలార్ క్లైమాక్స్ ను ప్లాన్ చేస్తే బాగుంటుందని సోషల్ మీడియా ద్వారా అభ్యర్థిస్తున్నారు.