Begin typing your search above and press return to search.
డార్లింగ్ ఫ్యాన్స్ లో సలార్ కన్ ప్యూజన్!
By: Tupaki Desk | 23 May 2022 12:30 PM GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ 'సలార్' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రభాస్ మ్యాన్లీ లుక్ నుంచి సినిమాటోగ్రాఫర్ భువన గౌడ ఇస్తోన్న లీక్స్ వరకూ ప్రతీది సినిమాపై అంచనాల్ని అంకంతకు పెంచేస్తున్నాయి.
ఇటీవలే సలార్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కేజీఎఫ్ ని మించి మూడు రెట్లు అధికంగా సలార్ ఉంటుందని బాంబ్ పేల్చారు. కంటెంట్..యాక్షన్..విజువలైజేషన్ ఇలా ప్రతీది సినిమాలో హైలైట్ ఆ నిలుస్తుందని అంచనాలు మొదలయ్యాయి . దీంతో అభిమానుల్లో ఆశలు రెట్టింపు అయ్యాయి. డార్లింగ్ కటౌట్ కి తగ్గ సిసలైన కంటెట్ తో రాబోతున్నాడని హైప్ క్రియేట్ అవుతుంది. ఎలాంటి ఇమేజ్ లేని యశ్ ని కేజీఎఫ్ తో పాన్ ఇండియా స్టార్ చేసాడు.
అలాంటి మేకర్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని ఇంకే రేంజ్ లోచూపిస్తాడో చెప్పాల్సిన పనిలేదంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 'సలార్' నుంచి వచ్చే ప్రతీ అప్ డేట్ కోసం ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో లీక్ చేసిన చిన్నబీటీఎస్ వీడియో ఇప్పుడు అభిమానుల్ని గందరగోళానికి గురి చేస్తుంది. సినిమా సెట్ నుంచి యాక్షన్ సీన్స్ ని చిత్రీకరిస్తున్న సమయంలో తీసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.
సీన్ లో జీపులు దుమ్ము రేపుతూ వెళ్లడం గమనించ వచ్చు. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఈ వీడియో ఇప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్ లో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇది సలార్ యాక్షన్ వీడియో అంటూ అభిమానులు భావిస్తున్నారు. కానీ ఇలాంటి సీన్ ని కేజీఎఫ్ లో చూసాం. ఆ వీడియోనే ఇప్పుడు సినిమాటోగ్రాఫర్ ఇలా షేర్ చేసారని కొందరు అంటుంటే..మరికొంత మంది సలార్ లీక్ అంటూ సంబర పడుతున్నారు.
ఈ వీడియోని ఉద్దేశించి భునవ గౌడ ఇంట్రెస్టింగ్ కామెంట్ కూడా ఎట్టారు. ఇది అంత సులభం కాదు అని దాని వెనుక ఉన్న శ్రమని చెప్పే ప్రయత్నం చేసారు. అయితే ఇది నిజంగా పాత వీడియో అయితే ఇప్పుడెందుకు షేర్ చేసినట్లు? ప్రస్తుతం సలార్ సెట్స్ లో ఉంది కాబట్టి..దాని అప్టేడ్ అయి ఉండొచ్చుగా? అని సందేహాలు తెరపైకి వస్తున్నాయి. మరి ఈ చిక్కు ముడి వీడాలంటే అసలు సంగతేంటి? అన్నది చెప్పాల్సి ఉంది.
ఇప్పటివరకూ సలార్ షూటింగ్ 30 శాతమే పూర్తయింది. ఔట్ ఫుట్ బాగా వచ్చిందని టీమ్ ధీమా వ్యక్తం చేసింది. బ్యాలెన్స్ అంతకు మంచి బెస్ట్ ఇవ్వడానికి ప్రశాంత్ శ్రమిస్తున్నారు. రేయింబవళ్లు టీమ్ సలార్ కోసం పనిచేస్తుందన్నారు. భువన గౌడ్ మాటల్ని బట్టి సలార్ ని హంబోలే ఫిల్మ్స్ ఎంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుందో అంచనా వేయోచ్చు.
బడ్జెట్ పరంగా 500 కోట్లు దాటే ఉంటుందని టాక్ వినిపిస్తుంది. ఇప్పటివరకూ ఇండియన్ సినిమా బడ్జెట్ 500 కోట్లు దాటింది లేదు. రెండు భాగాలకు కలిపి ఖర్చు చేసారు తప్ప..ఒకే భాగానికి అన్ని కోట్లు వెచ్చింది లేదు. ఆ లెక్కన 'సలార్' బడ్జెట్ పరంగా రికార్డు ముందే సృష్టించే అవకాశం ఉంది.