Begin typing your search above and press return to search.
'సలార్' లో దాయాదీల యుద్దం
By: Tupaki Desk | 21 Aug 2021 5:54 AM GMTప్రభాస్.. ప్రశాంత్ నీల్ ల కాంబోలో రూపొందుతున్న సలార్ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. కేజీఎఫ్ వంటి భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ ప్రస్తుతం చేస్తున్న సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆయన కేజీఎఫ్ 2 విడుదల అయితే సలార్ స్థాయి మరింతగా పెరగడం ఖాయం అంటున్నారు. సలార్ లో యాక్షన్ సన్నివేశాలు కేజీఎఫ్ ను మించి ఉంటాయని అంటున్నారు. ఈ సినిమా లో ప్రభాస్ ను ప్రశాంత్ నీల్ చూపించబోతున్న తీరుకు పాన్ ఇండియా అభిమానులు ఫిదా అవ్వడం ఖాయం అంటున్నారు.
సలార్ సినిమా లో యుద్ద సన్నివేశాలు ఉంటాయని తాజా సమాచారం అందుతోంది. యుద్దం అంటే అది కూడా ఏదో చిన్న చితకా యుద్ద సన్నివేశాలు కాకుండా దాయాదీ దేశాలు అయిన భారత్ మరియు పాకిస్తాన్ ల మద్య జరిగిన గత యుద్దంను సలార్ లో రీ క్రియేట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం 1971 లో ఇండియా పాకిస్తాన్ మద్య జరిగిన యుద్దంకు సంబంధించిన సన్నివేశాలను దర్శకుడు సలార్ లో చూపించబోతున్నాడట. అత్యధికంగా ఖర్చు చేసి ఈ యుద్ద సన్నివేశాలను అత్యంత నాచురల్ గా చిత్రీకరించేందుకు గాను ఆయన ప్లాన్ చేస్తున్నాడట.
ఈ సినిమా లో ప్రభాస్ ద్విపాత్రాభినయం అంటున్నారు. మొత్తానికి ఈ సినిమాకు సంబంధించిన అంశాలు ఒకొక్కటి సినిమాపై అంచనాలు అలా అలా పెంచేస్తున్నాయి అనడంలో సందేహం లేదు. అద్బుతమైన సన్నివేశాలతో పాటు ఆకట్టుకునే యాక్షన్ సన్నివేశాలను దర్శకుడు ఈ సినిమాలో ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా లో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తున్న విషయం తెల్సిందే. ఇటీవలే హైదరాబాద్ షెడ్యూల్ ను ముగించుకున్న సలార్ టీమ్ త్వరలోనే మరో భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారు. యుద్ద సన్నివేశాల చిత్రీరణ తో సినిమా షూటింగ్ కు గుమ్మడి కాయ కొట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.