Begin typing your search above and press return to search.
మ్యాట్రిక్స్..టెనెట్.. డార్క్ థీమ్ లో సలార్ షూటింగ్
By: Tupaki Desk | 25 Sep 2021 4:30 PM GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా `కేజీఎఫ్` ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ `సలార్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కేజీఎఫ్ ని మించిన కంటెంట్ తో తెరకెక్కుతోందని ఇప్పటికే మీడియా కథనాలు అంతకంతకు హీటెక్కిస్తున్నాయి. వెండి తెరపై సరికొత్త ప్రభాస్ ని ఆవిష్కరించబోతున్నారంటూ ప్రచారం ఠారెత్తిపోతుంది. యాక్షన్ సీక్వెన్స్ లో ప్రభాస్ ని ఓ రేంజ్ లో హైలైట్ చేయబోతున్నట్లు ఇన్ సైడ్ టాక్ సైతం మారు మోగిపోతుంది. ఇప్పటికే సినిమా కోసం భారీ ఖర్చుతో సెట్లు నిర్మించి షూటింగ్ చేసారు. ఇందులో కేవలం విలన్ ని హైలైట్ చేయడానికే కొన్ని కోట్ల రూపాయల ఖర్చుతో ప్రత్యేకంగా ఓ సెట్ నిర్మించి..అందులో ఆయనకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాల్ని చిత్రీకరించిన సంగతి తెలిసిందే.
దీనికి సంబంధించిన షూటింగ్ అంతా మైసూర్ లో జరిగింది. ఇక ప్రభాస్ కోసం..సన్నివేశాల్లో రియాల్టీ కోసం నిర్మాతలు ఇంకే రేంజ్ లో ఖర్చు చేస్తున్నారో? ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ప్రభాస్ కోసం ప్రత్యేకంగా ఓ బైక్ నే డిజైన్ చేసారు. ఆ బైక్ ఖర్చు భారీగా అయింది. 1970 కాలానికి సంబంధించి యాక్షన్ స్టోరీ అని ఇప్పటికే ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో అప్పటి రియాల్టీని చూపించడం కోసం ఆ కాలానికి సంబంధించి సెట్స్ నే డిజైన్ చేస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా ఓటీమ్ నే నియమించారు. తాజాగా సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర అప్ డేట్ అందింది.
సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు స్ర్కిప్ట్ డిమాండ్ మేరకు డార్క్ థీమ్ లో షూటింగ్ చేయాల్సి వస్తోందిట. దీంతో సెట్ నిర్మాణంలో మ్యాట్రిక్స్..టెనెట్ కి వాడిన బ్లాక్ టెంట్స్ వినియోగిస్తున్నారుట. ఇవి ఎంతో ఖరీదైనవి. వాటి కోసమే లక్షలు వెచ్చించాల్సి ఉంటుందిట. డార్క్ థీమ్ షూటింగ్ కోసమే మరోసారి కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తోందని తెలుస్తోంది. ఇందులో ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ నటిస్తోంది. హాంబోలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అన్ని పనులు పూర్తిచేసుకుని 2022 లో ప్రేక్షకుల ముందుకు రానుంది.