Begin typing your search above and press return to search.

పాక్.. తలాక్.. ఫాదర్ అలా అంటున్నారు

By:  Tupaki Desk   |   22 Oct 2016 4:34 AM GMT
పాక్.. తలాక్.. ఫాదర్ అలా అంటున్నారు
X
ఇప్పుడు దేశంలో నడుస్తున్న హాట్ టాపిక్స్ లో మూడు ప్రధానమైన ఇష్యూలు ముస్లింలకే లింక్ అయి ఉండడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇండియా-పాకిస్తాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం మొదటిది.. దీని మూలంగా మొదలైన పాక్ నటుల సినిమాలు అడ్డుకోవడం రెండోది కాగా.. ట్రిపుల్ తలాక్ నడుస్తున్న డిబేట్ మూడోది. మరి వీటిపై బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తండ్రి కం ఫేమస్ రైటర్ అయిన సలీమ్ ఖాన్ కామెంట్స్.. అందరినీ ఆలోచనలో పడేసేవే.

'ఒకే సిట్టింగ్ లో ట్రిపుల్ తలాక్.. ఖురాన్ నియమాలకు వ్యతిరేకం. యూనిఫాం సివిల్ కోడ్ ను చాలామంది ముస్లింలు కూడా సరిగా అర్ధం చేసుకోకుండా వ్యతిరేకిస్తున్నారు. ఇది ముస్లిం చట్టాలకు ఏ మాత్రం అడ్డుపడదు. 33 శాతం ముస్లింలు ఉన్న దేశాల్లో కూడా ఏ ప్రత్యేకమైన ఇస్లామిక్ చట్టం లేకుండానే జీవిస్తున్నారు. అయినా ప్రశాంతం గానే ఉన్నారు. అసలు పెద్ద సమస్యల్లా ఏంటంటే.. ముస్లింలు ఇస్లామిక్ చట్టం పాటిస్తున్నారా అన్నదే. మీరు దారి చూపలేకపోయినా.. తప్పుదారి పట్టించకండి' అంటూ సలీమ్ ఖాన్ ట్వీట్ చేశారు.

సినిమా ఇండస్ట్రీ చీలిపోయిందనే మాట సరికాదన్న సలీమ్ కాన్.. వివక్షకు బేధాభిప్రాయాలకు సినిమా రంగంలో చోటు లేదని తేల్చేశారు. దాదా సాహెబ్ ఫాల్కే రోజుల నుంచి ఎటువంటి విబేదాలు లేకుండా సినిమా రంగం కొనసాగుతోందని చెప్పిన ఆయన.. కొందరు తమ స్వార్ధం కోసం రాజకీయ పార్టీలకు వంతపాడుతూ ఇలాంటివి రగిలిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. తన ట్వీట్ చివర్లో 'మన సినిమా హిట్ అయినప్పుడే కాదు.. మన రైవల్ సినిమా ఫ్లాప్ అయినపుడు కూడా సంతోషిస్తాం కదా' అంటూ రైటర్ ఇచ్చారు సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/