Begin typing your search above and press return to search.
టాప్ ఖాన్స్.. స్నేహం కటీఫ్
By: Tupaki Desk | 26 Oct 2015 7:30 AM GMTబాలీవుడ్ లో ఏ ఇద్దరు స్టార్ హీరోల మధ్య సఖ్యత అంత వీజీ కాదు. అక్కడ కొట్లాటలు ఎక్కువే. ఈగోలు - గొడవలు - మనస్థాపాలు ఇవన్నీ ఎప్పటికప్పుడు వార్తల్లోకొస్తూనే ఉంటాయి. లేటెస్టుగా సల్మాన్ ఖాన్ - అమీర్ ఖాన్ మధ్య విభేదాలు తలెత్తాయన్నది హాట్ న్యూస్. భజరంగి భాయిజాన్ సినిమాని నేను వదులుకుంటే సల్మాన్ నటించాడని అమీర్ ఖాన్ బహిరంగంగా ప్రకటించాడు. దీంతో సల్మాన్ కి చిర్రెత్తుకొచ్చిందని సమాచారం. ఆ సంగతి నిజమే అయినా ఇలా బాహాటంగా ప్రకటించడం బాలేదని తనని కించపరిచినట్టయ్యిందని సల్మాన్ భావిస్తున్నారుట. ప్రస్తుతం అమీర్ - సల్మాన్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది.
మున్నాభాయ్ రోల్ వదులుకున్నానని షారూక్ ఏనాడైనా పెదవి విప్పాడా? లగాన్ ఆఫర్ తిరస్కరించానని అభిషేక్ ఏనాడైనా నోరు విప్పి మాట్టాడాడా? కానీ అమీర్ ఎందుకిలా నోరు పారేసుకుంటున్నాడు? అంటూ సల్మాన్ ఫీలయ్యాడు.ప్రస్తుతం సల్మాన్ - అమీర్ ఖాన్ ఇద్దరూ రెజ్లింగ్ నేపథ్యంలోని సినిమాలలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగిందని చెప్పుకుంటున్నారు. మీ సినిమాలో సన్నివేశాలు - బ్యాక్ డ్రాప్ - లొకేషన్ అన్నీ మార్చెయ్ అంటూ అమీర్ కాస్త తలబిరుసుగానే సల్మాన్ ని వార్న్ చేశాడుట. అందుకే సల్మాన్ ఇప్పుడు మిస్టర్ పెర్ ఫెక్ట్ పై గుర్రుగా ఉన్నాడని చెప్పుకుంటున్నారు. టూ బ్యాడ్ ఫ్రెండ్షిప్.